BigTV English

Suriya- Jyothika: భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలేమో.. వావ్.. సూపర్

Suriya- Jyothika: భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలేమో.. వావ్.. సూపర్


Suriya- Jyothika: ఈ జనరేషన్ లో పెళ్లి అనేది చాలా ఈజీ అయిపోయింది. వారం రోజులు ప్రేమించుకోవడం.. పెద్దలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవడం.. ఏడాది కూడా తిరక్కముందే విడాకులు తీసుకోవడం. మళ్లీ ఇంకోరితో ప్రేమ.. ప్రస్తుత సమాజంలో ఇదే పంథా కొనసాగుతోంది. భార్యాభర్తలు అన్నాకా.. కష్టసుఖాలను, ఒడిదుడుకులను పంచుకోవాలి. ఒకరికి ఒకరు సపోర్ట్ గా నిలబడి ఇద్దరూ కలిసి ఎదగాలి. ఈ కాలం జంటలకు అదే లేదు. అలాంటివారందరికి ఒక ఉదాహరణగా నిలిచారు సూర్య – జ్యోతిక. ఇండస్ట్రీలోనే అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే ఈ జంట పేరు టాప్ 5 లో ఉంటుంది.

సూర్య- జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఉమ్మడి కుటుంబాన్ని జ్యోతిక.. పెద్ద కోడలిగా ఎంతో అద్భుతంగా నడిపింది. ఇప్పటికీ కార్తీ.. జ్యోతిక మా అమ్మ తరువాత అమ్మ. ఆమె కనుక లేకుంటే మేము ఎప్పుడో బయటకి వచ్చేవాళ్ళం అని చెప్పుకొచ్చేవాడు. అంతలా జ్యోతిక ఇంటి బాధ్యతలను తీసుకుంది. ఇక పిల్లల కోసం ఇండస్ట్రీకి దూరమైన జ్యోతిక.. కొన్నేళ్ల క్రితం నుంచి రీ ఎంట్రీ ఇచ్చి.. నటిగా, నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. తాను ఇంత సక్సెస్ అయ్యాను అంటే దానికి కారణం తన భర్త సూర్య అని, అతని సపోర్ట్ లేకపోతే ఇదంతా తనవలన కాలేదని చెప్పుకొచ్చింది. సూర్య సైతం తన బలం, బలగం తన భార్యనే అని చెప్పుకొస్తాడు. ఇక ప్రస్తుతం ఈ జంట వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


గత కొంతకాలంగా జ్యోతిక జిమ్ లో చెమటలు చిందిస్తున్న విషయం తెల్సిందే. ఫిట్ నెస్ కోసం ఆమె ఎంతో కఠినమైన వర్క్ అవుట్స్ చేస్తూ.. ఆ వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈసారి సూర్యను కూడా తీసుకొచ్చింది. భార్యాభర్తలు ఇద్దరూ జిమ్ లో కష్టపడుతున్న వీడియోను షేర్ చేసింది. సూర్య కంగువ కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ ఒకరికి ఒకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ వర్క్ అవుట్స్ చేస్తున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలేమో.. వావ్.. సూపర్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×