VD 12 : గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈసారి మాత్రం ఎలాగైనా సరే హిట్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ఆ హిట్టు కోసం విజయ్ దేవరకొండ ఏకంగా ముగ్గురు హీరోల సాయాన్ని తీసుకోబోతున్నారు. ఒక్కో భాషలో ఒక్కో హీరో విజయ్ దేవరకొండకి సపోర్ట్ చేయబోతున్నారు. ఆ హీరోలు ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…
విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి స్టార్ హీరోలు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gautham THinnanuri) కాంబినేషన్లో ఓ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను ‘వీడి 12’ (VD 12) అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా, ఈనెల 12న టైటిల్ తో పాటు టీజర్ ని కూడా రివీల్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ మూవీ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో పాటు మరో ముగ్గురు స్టార్స్ పని చేశారని అంటున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘వీడి 12’ (VD 12) మూవీ తెలుగు వర్షన్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారని అంటున్నారు. ఆయన వాయిస్ తోనే మూవీ ప్రారంభం అవుతుంది అనేది ఈ తాజా వార్తల తారాంశం. అచ్చం ఇలాగే హిందీలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), తమిళ్ వర్షన్ కి సూర్య (Suriya) వాయిస్ ఓవర్ అందించారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే విజయ్ దేవరకొండకు హిట్టు ఇవ్వడానికి ఏకంగా మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు సినిమాలో భాగమైనట్టే.
మార్చ్ లో మూవీ రిలీజ్…
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈ సినిమాలో మొట్టమొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనువిందు చేయబోతున్నారు. రీసెంట్ గా కేరళలో పలు కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించారు. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
‘వీడి 12’ (VD 12) తర్వాత విజయ్ దేవరకొండ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నారు. దీనికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ఇందులో విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే చిత్ర వర్గాలు అనౌన్స్ చేశాయి. రాయలసీమ నేపథ్యంలో 1854 – 1878 మధ్యకాలంలో జరిగే కథతో ఈ మూవీ తెరపైకి రాబోతోంది.