Thandel : కొన్ని యదార్థ సంఘటనలను పరిగణలోకి తీసుకొని ఒక సినిమాను చేసినప్పుడు అనేక వివాదాలు రావడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా తండేల్. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చి మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తుంది. ఈ తరుణంలో ఈ సినిమాను చూసిన కొంతమంది మత్స్యకారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమోషనల్ స్టోరీ ని లవ్ స్టోరీ చేసేసారు అంటూ వాపోతున్నారు. తండేల్ చిత్రం టీం కి మేము చెప్పిన కథ వేరు వాళ్ళు చూపించిన వేరు అంటూ మత్స్యకారులు కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పాకిస్తాన్ జైల్లో మొత్తం 22 మంది ఇరుక్కుపోతే వాళ్లలో కేవలం 20 మంది మాత్రమే బయటకు వచ్చారు. ఇంకా ఇద్దరు రాలేదు వాళ్ల కోసం హీరో వెళ్లడం ఇలాంటివేమీ జరగలేదు కానీ సినిమాలో మాత్రం వేరేలా చూపించారు అంటూ తెలిపారు. మత్స్యకారుల జీవన విధానాలని, వ్యక్తిత్వాలను పక్కనపెట్టి కేవలం డబ్బులు చేసుకోవడానికి లవ్ స్టోరీ మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ సినిమా తెరకెక్కించారు అంటూ తెలిపారు. పాకిస్తాన్ జైల్లో కష్టాలు పడిన మత్స్యకారులని బయటకు తీసుకొస్తామని చాలామంది నాయకులు అప్పట్లో తమకు మాట కూడా ఇచ్చారని, అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి వాళ్లను బయటకు తీసుకొచ్చాడు అంటూ కూడా తెలిపారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
యదార్థ సంఘటనలను పక్కనపెట్టి ఒక కల్పిత కథతో ప్రేక్షకులను మభ్యపెట్టారు అంటూ మత్స్యకార సోదరులు తెలుపుతున్నారు. ఈ సినిమా యదార్థ సంఘటనను పరిగణలోకి తీసుకొని సినిమాను చేసి ఉంటే ఇంకా సినిమా హైలైట్ అయ్యేది. కేవలం కథను వక్రీకరించి చేయడం వల్ల బాధిత కుటుంబాలు కూడా చాలా బాధపడుతున్నాయి. ఇది రియల్ స్టోరీ అని చెప్పారు కానీ దీంట్లో రియాలిటీ లేదు. అప్పట్లో ఉన్న నాయకులు వీళ్ళ కోసం ఏం చేశారు.? జైల్లోకి వెళ్లిన వాడు హీరోనా జైలు నుంచి విడిపించినవాడు హీరోనా అంటూ.. పలు రకాల కామెంట్స్ ను చేశాడు ఒక మత్స్యకార సోదరుడు ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇకపోతే ఈ సినిమాతో మంచి కలెక్షన్స్ రాబెట్టాడు నాగచైతన్య. నాగచైతన్య కెరియర్లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయి. సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం పెద్దగా సినిమాలు ఏమీ లేవు కాబట్టి ఈ సినిమాకి మరింత మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది.
Also Read : VD 12 : విజయ్ దేవరకొండకు స్టార్స్ సాయం… రంగంలోకి ముగ్గురు హీరోలు