Kanguva trailer Release: తమిళ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువా’. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దిశాపటానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ దేవోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.
తాజాగా, మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, ఇటీవల ఆగస్టు 12న ట్రైలర్ విడుదల చేస్తున్నట్లుగా సూర్యపై పోస్టర్ తో మేకర్స్ అనౌన్స్ మెంట్ చేసిన విధంగానే మేకర్స్ విడుదల చేశారు. (కంగువ ట్రైలర్‌ను తెలుగులో చూడాలనుకుంటే..సెట్టింగ్స్‌లో ఆడియో ట్రాక్ మార్చుకోవాల్సి ఉంటుంది.)
ట్రైలర్ విషయానికొస్తే.. మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి…వాటన్నిటికంటే మనది అంతు చిక్కని రహస్యం… అనే ఫిమేల్ వాయిస్‌తో మొదలువుతోంది. ఇక డైలాగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. పది చుక్కలు నేలని తాకేలోపు కంగువను ఇక్కడ ఉండాలి..వెళ్లండి అన్న తర్వాత ఈ రక్తం నా రక్తం వేరువేరా..అని సూర్య చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. శిరం శరీరం వేరై భూమి ఒరిగినా.. నుదిటి నేల రాలదు. నడుము మోకరిల్లదు బానిసత్వం చెల్లదు.. వంటి డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి.
ఈ సినిమా రెండు పార్టులుగా తీయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు రెండు నెలల ముందే ట్రైలర్ విడుదల చేయడం విశేషం. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా..స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.