EPAPER

Swag: శ్రీ విష్ణు కి కొత్త ట్యాగ్ ఇచ్చిన యంగ్ దర్శకుడు

Swag: శ్రీ విష్ణు కి కొత్త ట్యాగ్ ఇచ్చిన యంగ్ దర్శకుడు

Swag: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో శ్రీవిష్ణు ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకుడుగా పరిచయమైన మెంటల్ మదిలో సినిమాతో హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వివేక్ చేసిన బ్రోచేవారెవరురా, వేణు అడుగుల దర్శకత్వం వహించిన “నీది నాది ఒకే కథ” వంటి ఎన్నో కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేశాడు. అయితే వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో కొన్ని డిజాస్టర్స్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సామజవరగమన సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించి మంచి కం బ్యాక్ ఫిలిం అయింది.


ఒక చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాను మినీ నువ్వు నాకు నచ్చావ్ అని కూడా పోల్చిన వాళ్ళు ఉన్నారు. ఇక ప్రస్తుతం హాసిత్ గోలి దర్శకత్వంలో స్వాగ్ అనే సినిమాను చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. శ్రీ విష్ణు సరసన రీతు వర్మ ఈ సినిమాలో కనిపించనుంది. శ్రీ విష్ణు హీరోగా హసిత్ ఇంతకుముందు “రాజ రాజ చోర” అనే సినిమాను చేశారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అందుకే వీరు కాంబినేషన్లో వస్తున్న స్వాగ్ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ఈవెంట్ లో హసిత్ మాట్లాడుతూ..
మామూలుగా చిన్న సినిమాలుకు సంబంధించి కంటెంట్ కింగ్ అని చెబుతూ ఉంటారు. అలాంటి ఎన్నో కంటెంట్ ఉన్న సినిమాలను శ్రీ విష్ణు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకని శ్రీ విష్ణు కి కింగ్ ఆఫ్ కంటెంట్ అనే ట్యాగ్ ను ఇస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ ట్యాగ్ కూడా శ్రీ విష్ణుకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని చెప్పాలి. శ్రీ విష్ణు ఇదివరకే వివేక్ ఆత్రేయ చెప్పిన చాలా కథలను విన్నారు. శ్రీ విష్ణు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివేక్ దగ్గర రెండు మంచి కథలు ఉన్నాయి అవి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. వాటి కోసం నేను వెయిట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.


వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి, వేణు ఉడుగుల వంటి ఎంతో కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చాడు శ్రీ విష్ణు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో శ్రీ విష్ణు టైమింగ్ కూడా చాలామందికి ఇష్టం అని చెప్పాలి. కొన్ని ఇంటర్వ్యూస్ లో శ్రీ విష్ణు వేసే పంచు లైన్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. అదే టైమింగ్ సినిమాల్లో పెడితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కొంతమంది కామెంట్స్ కూడా అప్పట్లో చేసేవాళ్ళు. ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు చేసిన స్వాగ సినిమా తన కెరీర్ కి ఎంత మేరకు ప్లస్ అవుతుందో ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది.

Related News

Janaka Aithe Ganaka Censor : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పచ్చి బూతులు… అమ్మబాబోయ్ భరించలేం..

Vettaiyan: రజినీకాంత్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వేట్టయాన్’ స్పెషల్ స్క్రీనింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్

Viswam Censor : మూవీ చూసి బెదిరిపోయిన సెన్సార్ బోర్డ్… మొత్తం 14 కట్స్.. ఏ సీన్స్ కట్ చేశారంటే..?

JD Chakravarthy: చిరంజీవి.. పరమ దుర్మార్గుడు.. 8 రోజులు అలా..

Naga Chaitanya: నాగచైతన్య ట్విటర్ అకౌంట్ హ్యాక్.. అదేంటి అలా పోస్ట్ చేశాడు?

Prabhash : రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించిన ప్రభాస్..!

Unstoppable with NBK: సీజన్ 4 మొదటి గెస్ట్ గా అల్లు అర్జున్.. నంద్యాల టాపికే హైలైట్.. ?

Big Stories

×