Bigg Boss 8 Day 31 Promo1.. బిగ్ బాస్ సీజన్ 8 ఐదవ వారానికి చేరుకుంది. ఇప్పటికే నామినేషన్ రచ్చ ముగిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా 31వ రోజుకు సంబంధించి ఒక ప్రోమో ని విడుదల చేశారు బిగ్ బాస్ (Bigg Boss) .ఇందులో కలర్ కలర్ విచ్ కలర్ అంటూ ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో చూసిన ఆడియన్స్.. చిన్న పిల్లలు ఆడే గేమ్ ఆడిస్తున్నారంటూ బిగ్ బాస్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
కలర్ కలర్ విచ్ కలర్ డు యు వాంట్..
బిగ్ బాస్ ఇప్పుడు మీకు మార్నింగ్ మస్తీ అంటూ ఒక టాస్క్ ఇవ్వబోతున్నారు. అదే కలర్ కలర్ విచ్ కలర్ డు యు వాంట్ అంటూ బిగ్ బాస్ చెబుతాడు .దీంతో నబీల్ సూపర్ బిగ్ బాస్ అంటూ ఆనందం వ్యక్తం చేయగా, మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.నేను మీకు ఒక కలర్ చెబుతాను. ఆ కలర్ ఉన్న వస్తువుని మీ అపోనెంట్ కంటే ముందుగా తీసుకొచ్చి అక్కడున్న బాక్స్ లో పెట్టాల్సి ఉంటుంది అంటూ క్లియర్ గా టాస్క్ వివరిస్తారు బిగ్ బాస్.
అదిరిపోయే స్టెప్ లతో అదరగొట్టిన మణికంఠ..
దీంతో మొదట టాస్క్ లో భాగంగా ఆదిత్య ఓం , నాగ మణికంఠ వచ్చేశారు. దీంతో కలర్ కలర్ విచ్ కలర్ డు యు వాంట్ అంటూ నాగ మణికంఠ చెప్పగానే బిగ్ బాస్ బ్లాక్ కలర్ చెప్పారు. దీంతో బ్లాక్ వస్తువు కోసం ఇద్దరూ పోరాడారు. ఇకపోతే ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ ఆదిత్య తన చెప్పు వదిలేశారు. మరొకవైపు తన మైక్ మణికంఠ వదిలారు. కానీ ఆదిత్య ముందు రావడంతో మణికంఠ ఓడిపోయారు. ఓడిపోయిన వారికి ఏదైనా పనిష్మెంట్ ఇద్దామని బిగ్ బాస్ అడగగా దీంతో ఆదిత్య.. మణికంఠ ఒక మంచి ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేయాలి అని చెబుతాడు. సూపర్ మచ్చీ పాటకు డాన్స్ చేశాడు మణికంఠ.
అమ్మాయి గెటప్ లో అలరించిన పృథ్వీ..
ఆ తర్వాత నబీల్, నిఖిల్ రాగా.. నబీల్ ఓడిపోయాడు. దీంతో పనిష్మెంట్ పూల్ లో ఉన్న వాటర్ ను స్పూన్ సహాయంతో బకెట్ నింపాలని పనిష్మెంట్ ఇచ్చాడు. చివరిగా అమ్మాయి గెటప్ లో పృథ్వి ఎంట్రీ ఇచ్చి అందరిని నవ్వించేశారు. బిగ్ బాస్ మొత్తానికి అయితే ఈ ప్రోమో కాస్త చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో చాలా వైరల్ గా మారుతుంది ఇక పూర్తి గేమ్ చూడాలంటే రాత్రి వచ్చే ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. లేదంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమయ్యే షో ని మీరు ఇప్పుడే చూడవచ్చు.