E-Paper
Advertisement

Swag Collections : షాకిస్తున్న ‘స్వాగ్ ‘ కలెక్షన్స్.. ఎంత రాబట్టాలంటే?

Swag Collections : షాకిస్తున్న ‘స్వాగ్ ‘ కలెక్షన్స్.. ఎంత రాబట్టాలంటే?
Advertisement

Swag Collections : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు సినిమాల లైనప్ వేరే లెవల్.. విభిన్న మైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘సామజవరగమన’ ‘ఓం భీం బుష్’ వంటి హిట్ సినిమాలతో ఫామ్లో ఉన్నాడు శ్రీవిష్ణు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని ”స్వాగ్ ” అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనకి ‘రాజ రాజ చోర’ వంటి డీసెంట్ హిట్ ఇచ్చిన హాసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకుడు. రీతూ వర్మ, దక్ష నాగర్కర్ హీరోయిన్లు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ పక్క ‘దేవర’ ‘సత్యం సుందరం’ వంటి క్రేజీ సినిమాలు థియేటర్ల లో ఉన్నప్పటికీ.. వాటి పోటీని తట్టుకుని నిలబడాలి అంటే ‘శ్వాగ్’ మంచి టాక్ ను అందుకుంది.. ఈ మూవీ కలెక్షన్స్ ఇప్పుడు ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నాయి.

శ్రీ విష్ణు సినిమాల ప్రయోగాలు ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పిస్తున్నాయి. గతంలో వచ్చిన మొదటి మూడు సినిమాలు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన విభిన్న కథా చిత్రం స్వాగ్ మూవీ కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మాతృస్వామ్యం, పితృస్వామ్యం కథా నేపథ్యంతో భ్రూణ హత్యలు బ్యాక్ డ్రాప్‌తో కథ సాగుతుంది. మనిషి, మానవత్వం అనే అంశాల ఆధారంగా చక్కటి సందేశంతో రూపొందిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు ఐదు పాత్రల తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. ఈ సినిమాను సుమారుగా 16 కోట్ల రూపాయల తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 8 కోట్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా 1100 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు.. ఇక నాలుగు రోజులకు ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఒకసారి చూసేద్దాం..

Advertisement

ఇకపోతే ఈ మూవీ రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 40 లక్షల రూపాయలు నికరంగా, 2.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ మూవీ రెండో రోజు కూడా అలానే సాగాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.65 వసూల్ చెయ్యగా, నికరంగా 2.1 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. మొత్తంగా 4.6 కోట్లు రాబట్టింది. అదే విదంగా 8 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నాలుగు రోజులకు కాస్త పెరిగాయి. సోమవారం మళ్లీ కలెక్షన్స్ తగ్గాయి. ఇప్పటివరకు మొత్తంగా 10 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని టాక్. మొత్తంగా చూసుకుంటే ఇంకో 7 కోట్లు వసూలు చేస్తే గానీ సినిమా హిట్ అవ్వదు. మరి దసరా లోపు 16 కోట్లను రాబడుతుందా లేదా అన్నది చూడాలి.. గతంలో వచ్చిన ఓం బీమ్ బుష్ సినిమా అంత కలెక్షన్స్ అయితే ఈ మూవీ రాబట్టలేకపోయింది.. మరి ఈ మూవీతో విష్ణు హిట్ కొట్టాటా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఇక విష్ణు మరో ప్రయోగాత్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×