BigTV English
Advertisement

Rape Victim Family Shot: ‘రేప్ కేసు వెనక్కు తీసుకోవాలి’.. బాధితురాలి కుటుంబంపై తపాకీతో కాల్పులు!

Rape Victim Family Shot: ‘రేప్ కేసు వెనక్కు తీసుకోవాలి’.. బాధితురాలి కుటుంబంపై తపాకీతో కాల్పులు!

Rape Victim Family Shot| ఒక టీనేజ్ అమ్మాయిపై ఒక ఉన్మాది అత్యాచారం చేశాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పరారయ్యాడు. నెల రోజులు తప్పించుకొని తిరిగిన తరువాత ఒక రోజు అనూహ్యంగా ఆ బాధితురాలి ఇంటికి వచ్చాడు. తన వెంట తుపాకీ తీసుకువచ్చి.. బాధితురాలి కుటుంబ సభ్యులకు గురిపెట్టి.. తనపై పెట్టిన కేసుని వెనక్కు తీసుకోవాలని బెదిరించాడు. కానీ వాళ్లంతా అందుకు ఒప్పుకోలేదు. దీంతో అతను ముగ్గురు కుటుంబ సభ్యులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛతర్ పూర్ జిల్లా మొహారా గ్రామంలో నివసించే బిమ్లా దేవిపై (17, పేరు మార్చబడినది) సెప్టెంబర్ నెలలో ఒక రోజు రాత్రి ఆమె ఒంటరిగా ఇంటికి వెళుతుండగా.. భోలా అహరివార్ అనే 24 ఏళ్ల యువకుడు ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత అత్యాచారం చేశాడు. అతడి నుంచి తప్పించుకొని బిమ్లాదేవి ఇంటికి చేరింది. తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిమ్లాదేవి కుటుంబంలో ఆమె తల్లిదండ్రులు, తాత (60), బాబాయి (32) ఉన్నారు.

Also Read: 8 ఏళ్ల పాపపై అత్యాచారం చేసిన 64 ఏళ్ల వృద్ధుడు.. పాప తల్లి తప్పు కారణంగా కేసు కొట్టివేత..


బిమ్లాదేవి ఒక మైనల్ కావడంతో పోలీసులు అత్యాచారం కేసుతో పాటు, పోక్సో కేసు కూడా నమోదు చేసి నిందితుడు భోలా అహరివార్‌ని అరెస్టు చేయడానికి వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. నెల రోజులుగా పోలీసులు నుంచి తప్పించుకు తిరుగుతున్న భోలా అహరివార్ రెండు రోజుల క్రితం ఉదయాన్నే బిమ్లాదేవి ఇంటికి వెళ్లాడు. బలవంతంగా ఆమె ఇంట్లో ప్రవేశించి.. తనపై పెట్టిన అత్యాచారం కేసు ఉపసంహరించుకోవాలని లేకపోతే కాల్చి చంపేస్తానని తుపాకీ చూపిస్తూ బిమ్లాదేవి కుటుంబ సభ్యులందరినీ బెదిరించాడు.

ఆ సమయంలో బిమ్లాదేవి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆమె తాత, బాబాయ్ ఉన్నారు. అత్యాచారం కేసు వెనక్కు తీసుకోకుంటే కాల్చి చంపేస్తానని భోలా అహరివార్ బెదిరించగా.. బిమ్లా దేవి తాత అడ్డుపడ్డాడు. దీంతో భోలా ఆ పెద్దమనిషి ఛాతీపై కాల్చేశాడు. అది చూసి బిమ్లాదేవి, ఆమె బాబాయ్ భోలాతో తలపడ్డాడు. ఈ క్రమంలో వారిద్దరిని కూడా తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో బిమ్లా దేవి తాత అక్కడి కక్కడే మరిణించగా.. బిమ్లాదేవి, ఆమె బాబాయ్ కి తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగుపొరుగు వారు తుపాకీ కాల్పుల శబ్దాలు విని అక్కడికి వచ్చే సరికి.. వారందరినీ తుపాకీతో బెదిరిస్తూ.. భోలా అక్కడి నుంచి పారిపోయాడు.

Also Read: ‘నా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే ఓ హత్య చేయాలి’.. ఢిల్లీ డాక్టర్ మర్డర్ కేసులో ఇన్ని ట్విస్టులా..

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరేసరికి బిమ్లాదేవి, ఆమె బాబాయ్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. వారిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. బిమ్లాదేవి తాత మృతదేహాన్ని పోస్టమార్టం కోసం తరలించారు. నిందితుడు భోలాపై బిమ్లాదేవి తాత హత్య కేసు నమోద చేసి విచారణ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని ఛతర్ పూర్ జిల్లాలో ఇటీవల ఇలాంటిదే మరో ఘటన జరిగింది. ఒక 7 ఏళ్ల పాప, ఆమె తల్లిదండ్రులు తమ బంధువుల ఇంటికి పెళ్లి కోసం వెళ్లారు. అయితే పెళ్లి హడావుడి మధ్యలో పాప తప్పిపోయింది. ఎంత వెతికినా పాప కనిపించేలేదు. దీంతో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పాపను ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి ఊరి చివర పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ పాపపై పైశాచికంగా అత్యాచారం చేశాడు. పాప అరుపులు విని దారినపోయే వారు అక్కడికి చేరేసరికి ఆ రేపిస్ట్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో శరీరంతా గాయాలతో ఉన్న పాపను తీసుకొని గ్రామస్తులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు పాపను గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పాప వాంగ్మూలం తీసుకున్న పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రేపిస్టు కోసం గాలిస్తున్నారు.

Also Read:  ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్‌ని హత్య చేసిన కస్టమర్.. ఎందుకు చేశాడంటే?..

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×