BigTV English

SWAG Theatrical Trailer: అదరగొట్టేసిన శ్రీ విష్ణు.. హిట్ పక్కా..!

SWAG Theatrical Trailer: అదరగొట్టేసిన శ్రీ విష్ణు.. హిట్ పక్కా..!

SWAG Theatrical Trailer : ప్రముఖ హీరో శ్రీ విష్ణు (Sri Vishnu) తాజాగా నటిస్తున్న చిత్రం స్వాగ్ (Swag). హసిత్ గోలి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా, సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్, సునీల్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను, దక్ష నగర్కర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు చిత్ర బృందం. ట్రైలర్ ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు శ్రీ విష్ణుకి ఈ సినిమా పక్కా హిట్ ఇవ్వబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.


స్వాగ్ ట్రైలర్..

ట్రైలర్ విషయానికి వస్తే.. “మొన్ననే ఫ్రెంచ్ యువరాణిని ఏకాంతంగా కలిశాం” అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇక ఇందులో శ్రీ విష్ణు తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశారు. ఇందులో భవభూతి, యయాతి, కింగ్ భవభూతి, సింగ మొత్తం నాలుగు పాత్రలలో శ్రీ విష్ణు మనకు కనిపిస్తాడు. 1551లో మొదలైన ఈ కథ నేటి వరకు దాదాపు 4 టైం లైన్స్ లో నడవనున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. పురుషాధిక్యం అనే పాయింట్ ఆధారంగానే ఇప్పుడు స్వాగ్ సినిమా తీసినట్లు మనకు అర్థమవుతోంది. మొత్తం ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీ విష్ణు కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించబోతుందని ఆడియన్స్ అప్పుడే కామెంట్లు చేస్తున్నారు.


మళ్లీ యూ టర్న్ తీసుకున్న సునీల్..

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా పేరు దక్కించుకొని ఆ తర్వాత హీరోగా మారి అదృష్టాన్ని పరీక్షించుకున్న ప్రముఖ కమెడియన్ సునీల్ కలర్ ఫోటో, పుష్ప లాంటి చిత్రాలలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కమెడియన్ గా ట్రాక్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.ఇందులో సునీల్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ఎప్పటిలాగే ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది.

శ్రీ విష్ణు సినిమా కెరియర్..

బాణం, సోలో వంటి చిత్రాలలో సహాయ నటుడిగా నటిస్తూ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీ విష్ణు, 2013లో ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో నటించి , ఆ తర్వాత సంవత్సరం సెకండ్ హ్యాండ్ చిత్ర లో నటించారు. 2016 లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో మంచి గుర్తింపు లభించింది. విశాఖపట్నం కి చెందిన ఈయన.. అక్కడే గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ పట్టా అందుకున్నారు. క్రికెట్ అంటే చాలా ఇష్టం. యువకుడిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అండర్ 19 జట్టుకు ప్రాతినిధ్యం కూడా వహించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×