SIT Inquiry on Tirumala laddu: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఈ వారం లేదా పది రోజుల్లో దర్యాప్తు ముగియనుందా? రేపు తమిళనాడుకు మరో బృందం వెళ్తుందా?మొత్తం లెక్కలు తీస్తోందా? వైసీపీ ముగిని పోయినట్టేనా? చాలావరకు తేడాలొచ్చాయా? ఇవే ప్రశ్నలకు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి.
తిరుమల లడ్డూపై దర్యాప్తు వేగంగా చేస్తోంది సిట్. సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో టీమంతా తిరుమలలో మకాం వేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. సోమవారం ఉదయం తిరుమల లడ్డూ పోటు, నైవేధ్యం పోటు, అన్నదాన పోటులను సిట్ పరిశీలించింది. టీటీడీ మార్కెటింగ్ గొడౌన్‌ను పరిశీలించింది. టీటీడీ మార్కెటింగ్ అధికారి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దానిపైనా దృష్టి సారించింది.
నెయ్యిని ప్రొక్యూర్ చేయడానికి కమిటీ సభ్యులెవరు? నెయ్యిని ఏ రేషియాలో కొనుగోలు చేశారు? 10 లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేసేందుకు తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీతో ఒప్పందం కుదుర్చుకుంది గత టీటీడీ పాలక మండలి.
టెండర్లకు అనుకూలంగా ఆ కంపెనీ వ్యవహరించిందా లేదా? అందులో టీటీడీకి ఎంత నెయ్యి చేరింది? టీటీడీ ఈవో చెబుతున్నదాని ప్రకారం 10 ట్యాంకర్ల నెయ్యి తిరుమలకు చేరుకోగా, ఆరింటిని వినియోగించామని, నాలుగింటిని పరిశీలించారు. అందులో జంతువుల కొవ్వు కలిసినట్టు రిపోర్టు చెబుతోంది.
ALSO READ: డర్టీ పాలిటిక్స్, పోసాని కామెంట్స్ వెనుక..
ల్యాబ్ రిపోర్టు ప్రకారం ఏఆర్ డెయిరీని బ్లాక్ లిస్టులో పెట్టింది టీటీడీ. నందిని నెయ్యిని తీసుకొచ్చింది. జూన్‌లో కల్తీ జరిగిందన్నది అధికారుల మాట. సిట్ కమిటీ మూడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తోంది.
తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి ఓ టీమ్ వెళ్లనుంది. డెయిరీలో భాగస్వాములుగా ఎవరెవరున్నారు? ఏఆర్ డెయిరీ నెయ్యి విషయంలో ఎవరికైనా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందా? ఏడాదికి ఏఆర్ డెయిరీ టర్నోవర్ ఎంత? టెండర్ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ నడుస్తుందా? లేదా అనేది కూడా సిట్ విచారణలో తేలనుంది.
మరింత సమాచారం కోసం గత పాలక మండలిలో కీలకంగా వ్యవహరించిన కొందర్ని అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తిరుమలలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు..
తిరుమలలో లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించి పోటు కార్మికులతో మాట్లాడనున్న సిట్ అధికారులు. @TTDevasthanams#TirupatiLaddu #SITOfficers #Bigtv pic.twitter.com/1fI1uAwn1E
— BIG TV Breaking News (@bigtvtelugu) September 30, 2024