Usain Bolt : సాధారణంగా కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఇవాళ కోటీ శ్వరుడు..రేపు పేదవాడు కావచ్చు. ఇవాళ పేదవాడు రేపు దనవంతుడు కావచ్చు. అలాగే క్రీడారంగాల్లో కూడా.. ఇవాళ అద్భుతంగా క్రీడలు ఆడే అతను కొద్ది రోజుల తరువాత ఫామ్ కోల్పోవచ్చు. ఇవాళ చిరుత పులిలా పరుగెత్తిన వ్యక్తి.. కొద్ది రోజుల తరువాత తాబేలు లా అయిపోవచ్చు. ఇందుకు ఉదాహరణ జమైకా చిరుత.. ఉస్సెన్ బోల్ట్ అనే చెప్పవచ్చు. ఒకప్పుడు అతను చాలా మెరుపు వేగంతో సెకన్ల వ్యవధిల్లో 100 మీటర్ల రన్ ని పూర్తి చేసుకునే వాడు. కానీ ప్రస్తుతం పట్టుమంటే 10 మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాడు. మెట్లు ఎక్కాలంటూ అయాసపడుతున్నాడు ఉస్సెన్ బోల్డ్. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : Asia Cup 2025 : యూఏఈతో మ్యాచ్.. హోటల్‌లోనే పాక్ ఆటగాళ్లు… ఆసియా నుంచి ఔట్?
అయితే ఈ విషయాన్ని వాళ్లు.. వీళ్లు చెప్పలేదు.. స్వయంగా ఉస్సెన్ బోల్ట్ చెప్పాడు. 100 మీ, 200 మీ, 400 మీటర్లు మూడు ఒలింపిక్స్ లో మూడేసి చొప్పున తొమ్మిది స్వర్ణాలు సాధించిన ఘనత ఉసెన్ బోల్ట్ దే. 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ లో బోల్ట్ పతకాలను సాధించాడు. అనూహ్యంగా 2017లో బోల్ట్ అథ్లెటిక్స్ కి దూరమయ్యాడు. ఈ ఏడాది వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 4*100 మీ రిలేలో పాల్గొన్న బోల్ట్.. కండరాలు పట్టేయడతో సగం దూరంలోనే కుప్పకూలిపోయాడు. అథ్లెటిక్స్ ట్రాక్ పై బోల్ట్ అద్భుత ప్రయాణం చివరికీ అలా ముగిసిపోయింది. బోల్ట్ ఇప్పుడు తన కుటుంబంతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నాడు.
“పిల్లలు స్కూల్ కి వెళ్లే సమయంలో వారిని చూసేందుకు నిద్ర లేస్తాను. ఆ తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాను. వాస్తవానికి చేయడానికి తనకు పనేమి లేదు. అలా చిల్ అవుతూ ఉంటా.. కొన్ని సార్లు వర్కౌట్లు చేస్తా. మూడు బాగుంటే వెబ్ సిరీస్ చూస్తూ ఉంటా. పిల్లలు వచ్చేంత వరకు ఇలా టైమ్ పాస్ చేస్తా. ఆ తరువాత సమయం అంతా వాళ్లతోనే నాపై విసుగు వచ్చేంత వరకు వారితో ఆడుతూనే ఉంటా. ఆ తరువాత ఇంట్లోనే సినిమాలు చూస్తా. కానీ అదైతే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కాకపోతే తప్పక వర్కౌట్లు చేస్తా. వాస్తవానికి నేను రన్నింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నా.ఎందుకంటే మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస సరిపోవడం లేదు. అయాస పడుతున్నా అందుకే ఇకపై మరింత శ్రద్ధగా వర్కౌట్లు చేసి నా బ్రీత్ ను సరి చేసుకుంటా” అంటూ ఉసెన్ బోల్ట్ చెప్పుకొచ్చాడు. జమైకన్ ఇన్ ఫ్లూయెన్సర్ కాసీ బెనెట్ తో చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. 39ఏళ్ల బోల్ట్.. ఆమె ద్వారా అతనికి కూతురు ఒలింపియా (2020), కవల కుమారులు థండర్_సెయింట్ (2021) కలరు.