OTT Movie : కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ లు ఇప్పడు ట్రెండ్ ని సెట్ చేస్తున్నాయి. వీటిని చూడటానికి ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఇలాంటి స్టోరీలు బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే లీగల్ సిరీస్ లో కాజోల్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఇందులో ఆమె భర్త ఒక అఫైర్ లో చిక్కుకోవడం, అది వైరల్ అవ్వడంతో, ఈ సిరీస్ కోర్ట్ రూమ్ డ్రామాగా మారుతుంది. చివరి వరకు ఈ సిరీస్ మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా చేస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
నోయోనికా సెంగుప్త ఒక హౌస్‌వైఫ్. తన భర్త అభయ్, ఇద్దరు పిల్లలతో సంతోషకరమైన జీవితం గడుపుతుంటుంది. అభయ్ ఒక ప్రముఖ కార్పొరేట్ లాయర్. సరదాగా సాగుతున్న వీళ్ళ జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. అభయ్ ఒక స్కాండల్ (ఒక మహిళతో అఫైర్)లో చిక్కుకుని అరెస్ట్ అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న నోయోనికా మానసికంగా కుంగిపోతుంది. దీని వల్ల ఆమె కుటుంబ జీవితం దెబ్బతింటుంది. ఆమె 10 సంవత్సరాల తర్వాత లీగల్ కెరీర్‌కు తిరిగి వచ్చి, అభయ్‌ను కోర్టులో డిఫెండ్ చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో ఆమె తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంది.
ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామాలు, పర్సనల్ లైఫ్ సంఘర్షణలు మొదలవుతాయి. కథ నడిచే కొద్దీ నోయోనికా లీగల్ ఫైట్ మరింత తీవ్రమవుతుంది. అభయ్ అఫైర్ వలన ఆమె కుటుంబ సంబంధాలు ఒత్తిడికి గురవుతాయి. అభయ్ దోషి అని ప్రూవ్ అయితే జైలు జీవితం గడపాల్సి వస్తుంది. క్లైమాక్స్‌లో నోయోనికా కోర్ట్ లో విజయం సాధిస్తుందా ? అభయ్ ని ఇందులో ఇరికించారా ? నోయోనికా తన కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తుందా ? అనే విషయాలను ఈ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
“ది ట్రయల్: ప్యార్, కానూన్, ధోఖా” (The Trial: Pyaar, Kaanoon, Dhokha) 2023లో విడుదలైన హిందీ లీగల్ డ్రామా వెబ్ సిరీస్. సుపర్ణ్‌వర్మా దర్శకత్వంలో, ధర్మా ప్రొడక్షన్స్ దీనిని నిర్మించింది. ఈ సిరీస్ అమెరికన్ సిరీస్ “ది గుడ్ వైఫ్” కి అడాప్టేషన్. ఇందులో కాజోల్ (నోయోనికా సెంగుప్త) ప్రధాన పాత్రలో నటించింది. జిషు సెంగుప్త (అభయ్ సెంగుప్త), కుబ్రా సైత్ (ఫత్వా), గౌరవ్ పాండే (విజయ్), షీబా చాఢా (సునీతా) ముఖ్య పాత్రల్లో నటించారు. 8 ఎపిసోడ్‌ల ఈ సిరీస్ IMDbలో 7.2/10 రేటింగ్ పొందింది. ఇది 2023 జూలై 14న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలై, కాజోల్ పెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు అందుకుంది. 2023 ఓటీటీ ప్లే అవార్డ్స్ లో కాజోల్‌కు బెస్ట్ డెబ్యూ (ఫీమేల్) సిరీస్ గెలిచింది. సీజన్ 2, 2025 సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
Read Also : విమానంలోంచి ఊడి, 500 ఏళ్ల పాస్ట్ లో పడే చెఫ్… కొరియన్ ఫుడ్ లవర్స్ కు కన్నుల పండుగ ఈ సిరీస్