Actress Taapsee Pannu Secret Marriage with Denmark Badminton Player Mathias Boe: హీరోయిన్ తాప్సి పన్ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. రెండ్రోజుల క్రితం మార్చి 23వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తాప్సి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథాయాస్ బోను వివాహం చేసుకున్నట్లు తాజగా సోమవారం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాప్సి, మాథియోస్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 20 న ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కాగా.. 23వ తేదీన ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరిగాయని సమాచారం.
గత కొంతకాలంగా హీరోయిన్ తాప్సీ పన్ను, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బోతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరేలా తాప్సి, మాథియాస్ దిగిన ప్రైవేట్ ఫోటోలు కూడా కొన్ని నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. కానీ అధికారికంగా హీరోయిన్ తాప్సీ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో మీడియా కూడా పట్టించుకోలేదు.
సోషల్ మీడియాలో తాప్సీ స్నేహితులు పెట్టిన ఫోటోలతో ప్రస్తుతం తాప్సీ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్, రైటర్ కనీకా ధిల్లోన్, నటుడు పావలీ గులాటీ సోషల్ మీడియాలో ఉదయ్‌పూర్‌లో దిగిన ఫోటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో పావలీ, షాగూన్ సహా బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ రంకీరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా ఉన్నారు. అయితే ఇప్పటికే తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లిని నిరాడంబరంగా, రహస్యంగా చేసుకోవాలని ఉందని చెప్పింది.
Also Read: గల్లీలో ‘ఫ్యామిలీ స్టార్’ హోలీ సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన మృణాల్, విజయ్
ఇక ఈ వార్తలపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన తాప్సీ.. ‘ వ్యక్తిగత విషయాలపై ఒత్తిడి చేయకూడదు. నాకు చెప్పాలనిపిస్తే నేను బహిరంగంగా ప్రకటిస్తా. పెళ్లి అనేది అందరికి ఇంపార్టెంట్. టైం వచ్చినపుడు దాని గురించి నేనే చెప్తా’ అని అన్నారు.
టాలీవుడ్ లో మొదట మంచి ఆఫర్లతో సీనియర్ హీరోల సరసన నటించిన తాప్సీకి అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు వెళ్లి సెటిల్ అయిపోయింది. ఈ తరుణంలోనే పరిచయం అయిన మాథియాస్ తో ప్రేమాయణం సాగింది.