BigTV English

Family Star Movie Promotions: గల్లీలో ‘ఫ్యామిలీ స్టార్’ హోలీ సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన మృణాల్, విజయ్!

Family Star Movie Promotions: గల్లీలో ‘ఫ్యామిలీ స్టార్’ హోలీ సెలబ్రేషన్స్.. స్టెప్పులేసిన మృణాల్, విజయ్!
Family Star Moive Pramotions
Family Star Moive Pramotions

Family Star Moive Pramotions: సీతారామం మూవీతో భారీ హిట్ కొట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మృణాల్ ఠాకూర్.. వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ దక్కించుకుంటుంది. తెలుగులో మృణాల్ చేసిన సీతారామం, హాయ్ నాన్న సినిమాలు భారీ హిట్ సాధించాయి. రెండు సినిమాల్లో తన నటనతో ఫ్యాన్స్ గుండెల్లో గూడుకట్టేసుకుంది. సీతారామం సినిమాలో తన బ్యూటిఫుల్ లుక్స్ తో సినిమాకే అట్రాక్షన్‌గా మారింది. ఇక హాయ్ నాన్న సినిమాలోను తన నటనతో ప్రేక్షకులకు మరోసారి హార్ట్ ఎటాక్ తెప్పించింది. చీరకట్టులో అందాలను ఆరబోస్తూ నటించిన మృణాల్ ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో జత కట్టింది. ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.


ఫ్యామిలీ స్టార్ మూవీ టీం ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది. వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో నేడు హోలీ సందర్భంగా మూవీ టీం గల్లీలో తిరిగింది. ప్రజలతో హోలీ ఆడుతూ.. సందడి చేసింది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కలిసి ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో గల్లీ వాసులతో హోలీ ఆడిన అనంతరం స్టేజీపై డ్యాన్సులు వేశారు. ఫ్యామిలీ స్టార్ సినిమాలోని కళ్యాణి వచ్చావచ్చా సాంగ్ కు మృణాల్, దేవరకొండ వేసిన స్టెప్పులతో గల్లీలో అరుపులు, కేకలతో మోతమోగిపోయింది. ప్రస్తుతం వీరిద్దరి డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫ్యామిలీ స్టార్ నుండి విడుదలైన ఈ పాట మంచి హిట్ టాక్ అందుకుంది. అయితే ఈ పాటపై మృణాల్, విజయ్ ఆన్ స్క్రీన్ లో ఎంత బాగా నటించారో.. అదే విధంగా ఆఫ్ స్క్రీన్ లోను ప్రేక్షకులను అలరించారు. దీంతో అక్కడ జనం అంతా హీరో, హీరోయిన్లతో కలిసి హోలీ ఆడారు. కాగా, పరుశురామ్ డైరెక్షన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే గ్లింప్స్, సినిమా పాటలతో మూవీపై హైప్ క్రియేట్ అయింది.


Also Read: ‘త్రిప్తితో డేటింగ్ చేయాలని ఉంది’.. యానిమల్ ఫేమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విజయ్ దేవరకొండ తీస్తున్న వరుస సినిమాలు భారీ పరాజయాన్ని ఎదురుచూస్తుండడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లైగర్, ఖుషి సినిమాలపై భారీ అంచనాలు క్రియేట్ చేసినా.. ఆశించినంత పెద్దగా ఆడలేకపోయాయి. దీంతో మరోసారి కమ్ బ్యాక్ ఇవ్వడానికి విజయ్ దేవరకొండకు ఈ సినిమా పరీక్షగా మారింది. విజయ్ ఫ్యాన్స్ కూడా హిట్ టాక్ కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×