BigTV English

Moscow Terror Attack: మాస్కో ఉగ్రదాడి.. కోర్టులో నేరాన్ని అంగీకరించిన ముష్కరులు!

Moscow Terror Attack: మాస్కో ఉగ్రదాడి.. కోర్టులో నేరాన్ని అంగీకరించిన ముష్కరులు!

Moscow Terror Attack


3 Suspects Accepted Moscow Terror Attack Done By them: మాస్కోలో ఉగ్రవాదులు చేసిన దాడి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కపడేలా చేసింది. గత శుక్రవారం రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రదాడి చేసిన విషయం తెలిసిందే. అయతే ఈ దాడిని దాడికి పాల్పడిన కొందరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేయగా.. తామే నేరం చేశామని వారు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించారు.

రష్యా రాజధాని మాస్కోలో గత శుక్రవారం రాత్రి సంగీత కచేరీ జరుగుతుండగా ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడి చేశారు. తుపాకులు, బాంబులతో అక్కడ ఉన్నవారిపై విరుచుకుపడ్డారు. అయితే ఈ ఉగ్రదాడి కారణంగా దాదాపు 130 మందికి పైగా చనిపోగా.. 100 మందికిపైగా గాయాలపాలయ్యారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి చెందాయి. అప్రమత్తమైన రష్యా దళాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.


ఈ దాడి ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 11 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా వారిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించారు. దలేర్డ్జోన్ మిర్జోయెవ్ (32), సైదాక్రమి రచబలిజోడా(30), ముఖమ్మద్సోబిర్ ఫైజోవ్(19), షంసిదిన్ ఫరీదుని(25) అనే వీరిని మాస్కోలోని బాస్మన్నీ జిల్లా కోర్టులో హజరుపరచారు. వారిలో ముగ్గురు తామే ఈ దాడికి పాల్పడినట్లు కోర్టు ముందు అంగీకరించారు. దీంతో ఈ నలుగురిని మే 22వ తేదీ వరకూ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు తెలిపింది.

Also Read: India student dies at london: భర్తకు కొద్దిదూరంలో.. లండన్‌లో భారతీయురాలు మృతి

అయితే ఈ నిందితులు ఆప్ఘానిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ఉగ్రముఠాకు చెందిన వారికి రష్యా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నలుగురిలో ముగ్గురు కోర్టులో నేరాన్ని అంగీకరించగా.. మిలిగిన ఆ వ్యక్తి తీవ్రమైన గాయాలతో ప్రస్తుతం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని అధికారులు తెలిపారు. నేరాన్ని అంగీకరించిన ముగ్గురు కూడా గాయాలతోనే ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ దాడికి తాము బాధ్యులమని ఇటీవలే ఐఎస్ఐఎస్(ISIS) ప్రకటించింది. ప్రస్తుతం రష్యా పోలీసులు ఈ ఉగ్రదాడి ఘటనపై మరింతో లోతైన విచారణ చేస్తున్నామని వెల్లడించారు.

Tags

Related News

Russia Earthquake: రష్యాని కుదిపేసిన భూకంపం.. 7.4 గా నమోదు, ఆ తర్వాత ఇండోనేషియాలో

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

Anti-immigrant Sentiment: లండన్ నిరసనలు.. ఎవరికి పాఠం, ఎవరికి గుణపాఠం?

Donald Trump: అక్రమ వలసలే అన్నిటికీ కారణం.. భారత సంతతి వ్యక్తి దారుణ హత్యపై ట్రంప్ స్పందన

London: నిరసనలతో దద్దరిల్లిన లండన్‌.. లక్షమంది హాజరు, అదే ప్రధాన ఎజెండా?

Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట

Russia Earthquake: మరోసారి రష్యాను వణికించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ!

Nepal: నేపాల్ పార్లమెంట్ రద్దు.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

Big Stories

×