BigTV English

Taja Sajja: హిట్ హర్రర్ ప్రాంచైజీలో కుర్ర హీరో.. ఇది అస్సలు ఊహించలేదే.. ?

Taja Sajja: హిట్ హర్రర్ ప్రాంచైజీలో కుర్ర హీరో.. ఇది అస్సలు ఊహించలేదే.. ?

Taja Sajja: నేనున్నా నాయనమ్మ అంటూ ఇంద్ర సినిమాలో బాలనటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఎంతోమంది స్టార్ హీరోలసినిమాల్లో  బాలనటుడిగా నటించిన తేజ.. ఓ బేబీ సినిమాతో మళ్లీ  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరై.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్నీ అందుకున్న తేజ.. తరువాత అద్భుతం, ఇష్క్ సినిమాలతో వచ్చాడు. ఇవి ఆశించిన ఫలితాన్ని అందించలేకేపోయాయి.


 

ఇక తేజను స్టార్ గా మార్చిన సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తేజ పాన్ ఇండియా స్టార్  హీరోగా మారాడు. ఎక్కడికి వెళ్లినా హనుమాన్ హీరో అంటూ గుర్తుపడుతున్నారు. హనుమాన్ తరువాత తేజకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఈ కుర్ర హీరో మిరాయ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. సూపర్  యోధగా తేజ కనిపించనున్నాడు.  ఈ మధ్యనే రిలీజ్ అయిన మిరాయ్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

ఇక ఈ సినిమా కాకుండా తేజ మరో పెద్ద ప్రాజెక్ట్ ను లైన్లో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  కోలీవుడ్ నుంచి వచ్చిన  హర్రర్ సినిమాల్లో డిమాంటీ కాలనీకి ఉన్న ఫ్యాన్స్ బేస్ వేరు. హర్రర్ ప్రాంజైజీగా  డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను తెరకెక్కించాడు. అరుళ్నితి, రమేష్ తిలక్, సనంత్ మరియు అభిషేక్ జోసెఫ్ జార్జ్  నటించిన ఈ సినిమా 2015లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.  ఈ సినిమా హిట్ తరువాత డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు.. అంజలి CBI, కోబ్రా సినిమాలను తెరకెక్కించాడు. కానీ, అవేమి ఆశించిన ఫలితాలను అందించలేదు. దీంతో మరోసారి తనకు అచ్చొచ్చిన హర్రర్ కాన్సెప్ట్ నే నమ్ముకొని డిమాంటీ కాలనీ 2 ను తెరకెక్కించాడు.

 

గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.  ఇక ఇప్పుడు ఈ హిట్ ప్రాంజైజీలో మరో సినిమాను ప్లాన్ చేశారు. డిమాంటీ కాలనీ 3 పేరుతో కొత్త కథను రెడీ చేస్తున్నాడట. ఈ సినిమాలో కుర్ర హీరో తేజ సజ్జాను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే తేజ..  చెన్నై వెళ్లి అజయ్ జ్ఞానముత్తును కలిసి వచ్చాడట. హర్రర్ కథ వినిపించగానే తేజ కూడా ఇంప్రెస్ అయ్యాడని, వెంటనే డిమాంటీ కాలనీ 3  సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అది హీరోగానా.. ? లేక కీలక పాత్రలో నటిస్తున్నాడా.. ? అనేది ఇంకా క్లారిటీ లేదు. మొదటి నుంచి తేజ.. తన కథలను ఎంచుకొనే విధానంలో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. మరి కోలీవుడ్ లో కూడా ఈ కుర్ర హనుమాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×