Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ మధ్య బాలీవుడ్ లోనే ఎక్కువ కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఏ ముహూర్తాన బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిందో కానీ, అమ్మడు బాలీవుడ్ లోనే పాగా వేసింది. అంతేనా మునుపెన్నడూ లేనంతగా అందాల ఆరబోత చేస్తూ షాకుల మీద షాకులు ఇస్తుంది. ఇక ఈ మధ్యనే బాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న తమన్నా.. ప్రస్తుతం ఓదెల 2 సినిమాలో నటిస్తోంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో ఎక్కువ ఐటెంసాంగ్స్ చేసిన హీరోయిన్ అంటే తమన్నా పేరే మొదట ఉంటుంది. ఐతే ఇలాంటి సాంగ్స్ కేవలం డబ్బు కోసం మాత్రమే కాదని, తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, ఇలాంటి సాంగ్స్ లో చేస్తే.. ఆ డ్యాన్స్ చూపించొచ్చు అని చెప్పుకొచ్చింది. స్టార్ హీరోల సినిమాల్లో ఐటెంసాంగ్ చేయడానికి తమ్ము ఎప్పుడు వెనుకాడదు.
ఇక బాక్ సినిమాలో కానీ, జైలర్ లో కానీ, అమ్మడి డ్యాన్స్ కు, అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక తాజాగా తమన్నా మరో హాట్ ఐటెం సాంగ్ లో అమ్మడు స్టెప్పులు వేసింది. ఐదేళ్ల కిందట బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాల్లో స్త్రీ ఒకటి. రాజ్‌కుమర్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా అమర్ కౌశికే దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ రానుంది. స్త్రీ 2 అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమన్నా ఐటెంసాంగ్ లో మెరిసింది. నేడు రిలీజ్ చేసిన టీజర్ లో తమన్నా ఐటెంసాంగ్ లో స్టెప్స్ వేస్తూ కనిపించింది.
గ్రీన్ కలర్ డ్రెస్ లో అమ్మడు అందాల ఆరబోత, ఆ స్టెప్స్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం తమన్నాకు సంబంధించిన ఈ స్టెప్స్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ఈ సాంగ్ తో తమన్నా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.