BigTV English

Tamannaah : త‌మ‌న్నా డ‌బుల్‌ డ‌బుల్ ధ‌మాకా

Tamannaah : త‌మ‌న్నా డ‌బుల్‌ డ‌బుల్ ధ‌మాకా
Tamannaah


Tamannaah : మిల్కీ బ్యూటీ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి పుష్క‌రకాలం దాటేసింది. అయితేనేం ఇంకా గ్లామ‌ర్ విష‌యంలో ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్‌కు ధీటుగా పోటీ ప‌డుతుంది. వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుటోంది. ఇటు సిల్వ‌ర్ స్క్రీన్‌పైనే కాదు.. అటు డిజిట‌ల్ మాధ్య‌మంలోనూ వ‌రుస ప్రాజెక్టులు చేస్తూ ముద్దుగుమ్మ బిజీగా ఉంటోంది. అంతే కాదండోయ్ స్పెష‌ల్ సాంగ్స్‌లోనూ హీరోల‌తో ఆడిపాడేస్తుంది. అయితే నెల గ్యాప్‌లో త‌మ‌న్నా డ‌బుల్ ధమాకాలు ఇవ్వ‌టానికి రెడీ అయిపోయింది. ఇంత‌కీ త‌మ‌న్నా ఇవ్వ‌బోయే డ‌బుల్ డ‌బుల్ ధ‌మాకాలు ఏంట‌నే వివ‌రాల్లోకి వెళితే..

జూన్ నెల‌లోనే త‌మ‌న్నా డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నుంది అది కూడా డిజిట‌ల్ మాధ్య‌మంలో అమెజాన్ ప్రైమ్‌లో త‌మ‌న్నా న‌టించిన జీ క‌ర్దా అనే వెబ్ సిరీస్ జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఆమె బోల్డ్ సీన్స్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 29న ల‌స్ట్ స్టోరీస్ 2తో సంద‌డి చేయ‌నుంది. దీనికి సంబంధించిన టీజ‌ర్ కూడా రిలీజైంది. ఇందులో ఆమె బోల్డ్ సీన్స్‌లో న‌టించింది. దీనికి సంబంధించి ఆమె నెట్టింట ట్రెండింగ్‌లో కొన‌సాగింది. నెల గ్యాప్ తీసుకుని అటే జూలై త‌ర్వాత ఆగ‌స్ట్‌లో మ‌రోసారి త‌మ‌న్నా డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నుంది.


ఇంత‌కీ ఆగ‌స్ట్‌లో త‌మ‌న్నా ఇవ్వ‌బోతున్న డ‌బుల్ ధ‌మాకా.. సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆగ‌స్ట్ 10న ర‌జినీకాంత్‌తో న‌టించిన జైల‌ర్ రిలీజ్ కానుంది. అలాగే ఆగ‌స్ట్ 11న మెగాస్టార్ చిరంజీవితో న‌టించిన భోళా శంక‌ర్ రిలీజ్ కానుంది. ఇద్దరు సీనియర్ స్టార్స్‌ నటించిన సినిమాలో కనిపించటం అనేది మామూలు విషయం కాాదు. నిజంగానే ఈ మ‌ధ్య కాలంలో ఓ స్టార్ హీరోయిన్ ఇలా డిజిటల్‌లోనూ అటు వెండితెరపై కూడానూ.. డబుల్ డ‌బుల్ ధ‌మాకాలు ఇచ్చిన దాఖ‌లాలు లేవు. దీనిపై మిల్కీ బ్యూటీ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు మ‌రి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×