BigTV English

Hearing Problem of The Baby : గర్భంలోని శిశువుకు వినికిడి సమస్య.. ఆ కెమికల్ వల్లే..

Hearing Problem of The Baby : గర్భంలోని శిశువుకు వినికిడి సమస్య.. ఆ కెమికల్ వల్లే..


Hearing Problem of The Baby : ఈరోజుల్లో చాలామందికి వినికిడి సమస్యలు అనేవి ఎక్కువయిపోతున్నాయి. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. మామూలుగా వృద్ధుల్లో, వయసు పైబడిన వారిలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు ఇప్పటివరకు చెప్పలేదు. కానీ తాజాగా మనుషుల్లో హియరింగ్ హెల్త్ దెబ్బతినడానికి ఒక కారణాన్ని వారు కనిపెట్టారు. దీనికి కారణం అని కెమికల్ అని వారు అంటున్నారు.

తాజాగా హియరింగ్ లాస్‌కు కారణాలు ఏంటి అని కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందులో భాగంగా పాలిక్లోరినేటెడ్ బైఫెనిల్స్ లేదా పీసీబీ అనే కెమికల్ వల్ల చెవులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వారు కనిపెట్టారు. మామూలుగా ఈ కెమికల్ వల్ల మనుషుల చెవులు ఒక రకమైన ట్రామాలోకి వెళతాయని, వయసు పెరుతున్నకొద్దీ దీని వల్ల వినికిడి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. ఒకప్పుడు పీసీబీ అనే కెమికల్ పరిశ్రమల్లో, కొన్ని ప్రొడక్ట్స్‌లో ఉపయోగించేవారు. కానీ తర్వాత అది బ్యాన్ అయిపోయింది.


1979లో అమెరికాలో ముందుగా ఈ పీసీబీ అనే కెమికల్ బ్యాన్ అయిపోయింది. దాని తర్వాత అక్కడ పరిశ్రమల్లో దీనిని ఉపయోగించడం పూర్తిగా మానేశారు. కానీ దీని వ్యాప్తి మాత్రం ఆగలేదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. పర్యావరణం నుండి ఈ కెమికల్‌ను ఎవరూ దూరం చేయలేకపోయారని, పలు మార్గాల్లో ఇప్పటికీ ఇది వ్యాపిస్తూనే ఉందని అన్నారు. ముఖ్యంగా చేపల ద్వారా ఈ కెమికల్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. పీసీబీ వల్ల గర్భంలో ఉన్న పిల్లలకు చాలా ప్రమాదం అని వారు హెచ్చరిస్తున్నారు.

గర్భిణి స్త్రీలు ప్రెగ్నెన్సీ మొదటి దశలో ఉన్నప్పుడు పీసీబీ కెమికల్‌కు చాలా దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఒక్కసారి మనిషి శరీరంలోకి చేరిన పీసీబీ.. మెదడు వరకు చేరేవరకు ఆగదని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ ఉన్నంతకాలం ఏదో ఒక విధంగా పీసీబీ స్త్రీలకు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుందని బయటపెట్టారు. ఎన్నో ఏళ్లుగా పీసీబీ గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటికీ దీని గురించి పూర్తిస్థాయి సమాచారం శాస్త్రవేత్తలు వద్ద లేదు. ఇది ఎలా వ్యాపిస్తుంది, ఏం హాని కలిగిస్తుంది అనే విషయాలపై అవగాహన ఉన్నా.. దీనిని అరికట్టే మార్గం తెలియదు.

గర్భంలో ఉన్న పిల్లలు బయటికి వచ్చిన తర్వాత.. జీవితంలో పెరుగుతున్న క్రమంలో పీసీబీ ద్వారా వినికిడి సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఈ హానిని కలిగించే శక్తి పీసీబీకి ఉందని వారు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ కెమికల్‌ను అదుపు చేయడానికి చికిత్స అనేది లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పైగా పర్యావరణంలో కలిసిపోయిన కెమికల్ కాబట్టి మనుషులే దీని గురించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×