BigTV English

TamilRockers kingpin arrested: రాయన్ ఫిల్మ్ పైరసీ.. పోలీసులకు చిక్కిన తమిళ రాకర్స్ కింగ్‌పిన్

TamilRockers kingpin arrested: రాయన్ ఫిల్మ్ పైరసీ.. పోలీసులకు చిక్కిన తమిళ రాకర్స్ కింగ్‌పిన్

TamilRockers kingpin arrested: ఫిల్మ్ ఇండస్ట్రీని పైరసీ భూతం వెంటాడుతోంది. సినిమా విడుదలైన గంటల వ్యవధిలో వైరసీ వెబ్‌సైట్లలో సినిమా అందుబాటులో ఉంటుంది. దీనిపై చిత్ర పరిశ్రమ నెత్తి నోరూ కొట్టుకుంటోంది. అంతేకాదు పోలీసుల సహకారం తీసుకుంటోంది.


ఇక తమిళనాడులో అయితే వైరసీ నిర్వాహకులు.. నిర్మాతలకు సవాల్ విసిరిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా తమిళ రాకర్స్ పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రీసెంట్‌గా నటుడు ధనుష్ నటించిన రాయన్ మూవీ రిలీజ్ అయ్యింది. కేరళలోని తిరువనంతపురంలో ఓ థియేటర్‌లో ఆ సినిమాను పైరసీ చేస్తుండగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరోకాదు తమిళ రాకర్స్ వెబ్‌సైట్ నిర్వాహకుడు.

తమిళ రాకర్స్ వెబ్‌సైట్ గురించి చెప్పనక్కర్లేదు. సినిమా రిలీజైన గంటల వ్యవధిలో ఈ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమవుతోంది. అరెస్టయిన వ్యక్తి పేరు జెఫ్ స్టీఫెన్ రాజ్. సొంతూరు మదురై. తమిళ రాకర్స్ వెబ్‌సైట్ కు కర్మ, కర్త, క్రియ అన్నీ ఇతగాడే. ఏళ్ల తరబడి పైరసీ వ్యాపారం చేస్తున్నాడు. రిలీజైన సినిమాలను పైరసీ చేసి గంటల వ్యవధిలో తన వెబ్‌సెట్‌లో పెడతాడు.


ALSO READ: ‘కుబేర’ సరికొత్త పోస్టర్ రిలీజ్..ధనుష్ ఇలా ఉన్నాడేంటి?

ఇలాంటి పనులు చేయడంలో ఆరితేరిపోయాడు స్టీఫెన్. అంతేకాదు ఈతగాడికి పెద్ద నెట్‌వర్క్ కూడా ఉంది. ఈ క్రమంలో తమిళ నిర్మాతలను ఛాలెంజ్ చేసిన సందర్భాలు లేకపోలేదు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. తనతోపాటు 12 మంది సినిమాలను పైరసీని చేస్తున్నట్లు వెల్లడించాడు.

33ఏళ్ల స్టీఫెన్‌రాజ్ ఏడాదిన్నరగా తిరువనంతపురంలో మకాం వేశాడు. ఇందుకోసం ఓ గెస్ట్‌హౌస్‌ని రెంట్‌కు తీసుకున్నాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. తమిళ రాకర్స్ వెబ్‌సైట్ నిర్వాహకులు విడుదలైన ప్రతీ సినిమాకు ఐదువేల చొప్పున ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రీమియర్ షోలకు టికెట్ల బుక్ చేయడం, ఆ సమయంలో సినిమాను పైరసీ చేసి తమిళ రాకర్స్ వెబ్‌సైట్‌లో అప్‌‌లోడ్ చేయడం ఇతగాని పని. కార్యకలాపాలన్నీ వాట్సాప్ ద్వారానే సాగిస్తాడు.

స్టీఫెన్‌రాజ్‌ నుంచి స్వాధీనం చేసుకున్నఫోన్‌లో లక్ష రూపాయలు విలువ చేసే పైరసీ మెటీరియన్‌ను గుర్తించారు పోలీసులు. మదురై నుంచి వచ్చిన స్టీఫెన్‌రాజ్ ఈ వ్యాపారంలోకి దిగాడు. పైరసీకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో స్టీఫెన్ పట్టుబడడంతో కీలక మలుపుగా భావిస్తున్నారు పోలీసులు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటపెట్టాడో చూడాలి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×