E-Paper
Advertisement

Teja Sajja: మిరాయ్.. సూపర్ యోధుడిని చూశారా.. ?

Teja Sajja: మిరాయ్.. సూపర్ యోధుడిని చూశారా.. ?
Advertisement

Teja Sajja:  తేజ సజ్జా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంద్ర సినిమాలో నేనున్నా  నాయనమ్మ అంటూ తొడగొట్టిన ఈ బాలుడు.. హీరోగా ఎంట్రీ ఇచ్చి.. హనుమాన్ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో హనుమాన్ రిలీజ్ అయ్యి ఏ రేంజ్ లో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఈ సినిమా తరువాత తేజ నటిస్తున్న చిత్రం మిరాయ్.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్  నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా పరిచయమవుతున్నాడు. ఇందులో తేజ సజ్జా సరసన రితిక నాయక్ నటిస్తోంది.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, మంచు మనోజ్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

యాక్షన్  అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూపర్ యోధగా తేజ కనిపిస్తున్నాడు. ఇక నేడు తేజ పుట్టినరోజు కావడంతో మేకర్స్.. ఒక కొత్త పోస్టర్ రిలిజ్ చేసి తేజకు బర్త్ డే విషెస్ తెలిపారు.  ఒక్క  ఇనుప రాడ్ ను పట్టుకొని గాల్లో నిలబడిన తేజ.. కిందపడకుండా  తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు.  ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

మిరాయ్  సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే కార్తీక్ ఘట్టమనేని ఈగల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు . తేజ హనుమాన్ తో హిట్ కొట్టాడు.. మంచు మనోజ్ మొదటిసారి విలన్ గా కనిపిస్తున్నాడు.  ఇక  ఒక సినిమాపై అంచనాలను పెట్టుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో తేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×