BigTV English

Railway Ticket QR Code: క్యూఆర్ కోడ్‌‌తో రైల్వే టికెట్ల కొనుగోలు.. ఇక కౌంటర్ల వద్ద రద్దీకి చెక్!

Railway Ticket QR Code: క్యూఆర్ కోడ్‌‌తో రైల్వే టికెట్ల కొనుగోలు.. ఇక కౌంటర్ల వద్ద రద్దీకి చెక్!

Railway Ticket QR Code| ప్రయాణీకుల సౌకర్యం కోసం భారత రైల్వే శాఖ టికెట్ కౌంటర్ల వద్ద డిజిటల్ సేవలు తీసుకురానుంది. ఇప్పటికే సెంట్రల్ రైల్వేలోని బిలాస్‌పూర్ డివిజన్ లో రైల్వే టికెట్ కౌంటర్ల వద్ద క్యూ ఆర్ కోడ్ సౌకర్యం కల్పించింది. దీంతో ప్రయాణీకులు కౌంటర్ల వద్ద టికెట్ కొనగోలు కోసం నగదు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.


బిలాస్‌పూర్ డివిజన్ లోని మొత్తం 81 స్టేషన్లలో ఈ వసతిని రైల్వే శాఖ ప్రారంభించింది. బిలాస్‌పూర్, రాయిగడ్, కోర్బా, లాంటి కీలక స్టేషన్ల వద్ద మాత్రమే ఈ వసతి ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని స్టేషన్లకు ఈ క్యూఆర్ కోడ్ సర్వీస్ విస్తరింపజేస్తారని రైల్వే శాఖ తెలిపింది.

క్యూర్ కోడ్ పేమెంట్ సిస్టమ్ తీసుకురావడం ద్వారా.. టికెట్ల కొనుగోలుకు కొత్త పేమెంట్ పద్దతి ప్రయాణీకులకు అందుబాటులోకి వస్తుంది. దీంతో రైల్వే స్టేషన్ లోని రిజర్వడ్ , అన్ రిజర్వడ్ కౌంటర్ల వద్ద క్యూర్ కోడ్ కేవలం మొబైల్ ఫోన్ ఉపయోగించి ప్రయాణీకులు త్వరగా టికెట్లు పొందవచ్చు.


ఇప్పటివరకు రైల్వే స్టేషన్ల టికెట్ కౌంటర్ల వద్ద క్యాష్ తీసుకొని పెద్ద లైన్‌లో నిలబడాల్సిన పరిస్థితి. పైగా టికెట్ కోసం సరిపడ క్యాష్ తీసుకెళ్లాలి. కౌంటర్ వద్ద చిల్లర లేకపోతే అదొక సమస్య. ఈ సమస్య క్యూ ఆర్ కోడ్ తో పరిష్కారం దొరికనట్లే. ఇప్పటికే వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ పాలసీతో కొన్ని మేజర్ రైల్వే స్టేషన్ల వద్ద కమర్షియల్ స్టాల్స్ లో క్యూఆర్ కోడ్ పేమెంట్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి.

Also Read: బ్యాంకు లో నెగిటివ్ బ్యాలెన్స్ తో డబ్బులు కట్ అవుతున్నాయా?.. ఇలా చేయండి.. తిరిగి వస్తాయి!!

బిలాస్ పూర్ డివిజన్ కు చెందిన సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ అనురాగ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ”కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ లో భాగంగానే టికెట్ కౌంటర్ల వద్ద క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చాం. దీనివల్ల ప్రయాణీకులు ఎంతో సౌకర్యం కలుగుతుంది. ఎక్కువసేపు లైన్ లో నిలబడే సమస్య ఉండదు. ప్యాసింజర్ లు క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వారికి మరింత సౌలభ్యం కలుగుతుంది.” అని చెప్పారు.

Also Read:  ట్రైన్ లేట్ అయితే మీ డబ్బులు ఫుల్ రిఫండ్.. షరతులు వర్తిస్తాయి!

బిలాస్ పూర్ రైల్వే డివిజన్ లో పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్‌తో పాటు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు, యుటియస్ మొబైల్ యాప్ కూడా తీసుకువచ్చాం. వీటి ద్వారా ప్రయాణీకులు త్వరగా టికెట్ కొనుగోలు చేయగలుగుతున్నారు. పెద్ద లైన్ లో నిలబడే సమస్య చాలా వరకు తగ్గింది.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

త్వరగా టికెట్లు పొందేందుకు ప్రయాణీకులు డిజిటల్ పేమెంట్ ఆప్షన్స్ ని ఉపయోగించాలని రైల్వే శాఖ ప్రకటించింది.

Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అత్యధిక వడ్డీ రేటు ఏ బ్యాంకు ఇస్తుందో తెలుసా?

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×