Teja Sajja Mirai: చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ (Teja Sajja) ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత సమంత(Samantha ) నటించిన ‘ఓ బేబీ’ సినిమాతో నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’ సినిమాతో పూర్తి హీరోగా మారారు. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న తేజ సజ్జ. హనుమాన్ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
వాయిదా పడుతున్న తేజ సజ్జ మిరాయ్ మూవీ..
ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎప్పుడో గత సంవత్సరమే ఈ సినిమా టీజర్ తో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసిన చిత్ర బృందం.. ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ అనుకున్న టైమ్ కి అయితే సినిమాను తీసుకురాలేకపోయారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమా మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలు అనుకున్న సమయానికి విడుదలవడంలో కాస్త ఆలస్యం చేస్తున్నాయని చెప్పాలి. అటు స్టార్ హీరోలను మొదులుకొని యంగ్ హీరోల సినిమాల వరకు దాదాపు చాలా సినిమాలు అనౌన్స్మెంట్ ఇచ్చిన విడుదల తేదీ కంటే కూడా ఆలస్యంగా విడుదలవుతూ అభిమానులలో నిరాశ మిగిలుస్తున్న విషయం తెలిసిందే.
నిర్మాతల వల్లే ఆలస్యం..
ఇక ఇప్పుడు తేజ.. మిరాయ్ మూవీ కూడా ఎప్పుడో ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉండగా…ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా షూటింగ్ ను మొన్నటి వరకు మేకర్సే ఆపివేశారు. కారణం బడ్జెట్ లోపం. డబ్బులు లేకపోవడం వల్ల సినిమా ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్ మొదలైంది. త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.. మొత్తానికైతే భారీ అంచనాల మధ్య విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజ, ఈసారి మరెలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.
మిరాయ్ సినిమా విశేషాలు..
2025 ఆగస్టు 1 ఈ సినిమా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో తేజ సూపర్ యోధా పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్ (Manchu Manoj), శ్రియా శరన్(Shriy Saran), రితిక నాయక్ (Rithika Nayak) తో పాటు పలువురు నటీనటులు భాగమయ్యారు. ఇందులో మనోజ్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నారు అని ప్రకటించారు. మరోవైపున ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడే ‘భైరవం’ సినిమా కూడా ప్రకటించారు మంచు మనోజ్. ఇప్పుడు మే 30వ తేదీన ఈ భైరవం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మరి అనుకున్నట్టుగా ఆగస్టు 1 మిరాయ్ సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి.
ALSO READ:Kollywood: ఆయన నాతోనే ఉంటాడు.. జయం రవి భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సింగర్..!