Road accident: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది బౌద్ధ యాత్రికులతో వెళ్తున్న బస్సు కోట్మలే ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
బస్సు కెపాసిటీ కంటే 20 మంది ఎక్కువగా బస్సులో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: AFMS Jobs: ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో భారీగా జాబ్స్.. 2 రోజులే ఛాన్స్
Also Read: UPSC Recruitment: యూపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే జాబ్