BigTV English

Kollywood: ఆయన నాతోనే ఉంటాడు.. జయం రవి భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సింగర్..!

Kollywood: ఆయన నాతోనే ఉంటాడు.. జయం రవి భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సింగర్..!

Kollywood: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (Ravi Mohan) అలియాస్ జయం రవి (Jayam Ravi) ఎక్కువగా సినిమాల కంటే వ్యక్తిగత కారణాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా కలిసి కాపురం చేసిన భార్య ఆర్తి (Arti) నుండీ ఇటీవల విడాకులు కావాలన్న ఈ హీరో.. ఇద్దరు పిల్లలు ఉన్నారు అని ఆలోచించకుండా విడాకులు కోరడంపై పలువురు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఫ్యామిలీ కోర్టు కూడా “ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఒకసారి ఆలోచించండి” అని కౌన్సిలింగ్ ఇచ్చినా.. ఈయన మాత్రం విడాకులే కోరుకున్నాడు. కాగా, రవి మోహన్ భార్య ఆర్తి దంపతుల మధ్య మనస్పర్ధలు రావడానికి ప్రముఖ సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ (Kenisha Francis ) కారణమని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై స్పందించిన రవి మాత్రం కెనీషా, తాను మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు.


సింగర్ తో జయం రవి.. ఆర్తీ ఇన్ డైరెక్ట్ కౌంటర్..
.
అందరూ కూడా ఇది కూడా నిజమేనేమో అని నమ్మే సమయంలో.. అనూహ్యంగా ఇటీవల జరిగిన ఒక పెళ్లి వేడుకల్లో కెనీషా, రవి మోహన్ జంటగా కనిపించడం, అందరి ముందే చట్టపట్టలేసుకొని కలియతిరగడం, ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇక వీరిద్దరూ స్నేహితులు కాదు ఏదో బంధం ఉంది అనేట్టు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ ఇలా చట్టా పట్టాలేసుకొని తిరుగుతుండడంతో జయం రవి భార్య ఆర్తికి కోపం వచ్చి సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్టు పెట్టింది. అటు జయం రవి, ఇటు కెనీషా పేర్లు ఆమె నేరుగా ప్రస్తావించకుండా.. ఇద్దరిపై ఊహించని కామెంట్లు చేసింది. జయం రవి..” తనను ఇంటి నుంచి బయటకు గెంటేసాడని, పిల్లల్ని పట్టించుకోవడంలేదని, అసలు అతను తండ్రేనా.?”అంటూ తన భర్త, హీరో జయం రవి పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్స్ కూడా ఆర్తికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

జయం రవి భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆర్తి..


ఇకపోతే ఆర్తికి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో సింగర్ కెనీషా ఆర్తికి కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీలో నేరుగా ఆర్తి పేరు ప్రస్తావించకుండా..” ఒక మగాడు ఎప్పుడూ ఎమోషన్స్ కి లొంగడు. ఏ మహిళ దగ్గరైతే ప్రశాంతత ఉంటుందో.. వాళ్లకే తన హృదయాన్ని ఇస్తాడు. మంచిగా, సైలెంట్ గా ఉన్నాను కదా అని, లైట్ తీసుకోకు. అదే నా నిజమైన బలం.. ఇకపై ఆయన నాతోనే ఉంటాడు..” అంటూ తన అభిప్రాయాన్ని కొటేషన్ రూపంలో పంచుకుంది. దీంతో ఈ కొటేషన్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇది చూసిన చాలామంది జయం రవి, కెనీషా మధ్య నిజంగానే ఎఫైర్ ఉందేమో అనే రేంజ్ లో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఇలా ఏమీ లేకపోతే ఆర్తి మాటలకు కెనీషా ఎందుకు కౌంటర్ ఇచ్చింది ..అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా జయం రవి భార్య , పిల్లల్ని కాదని ఇలా ఇంకో ఆమెతో తిరగడంపై అభిమానులు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.

ALSO READ:Big TV Kissik Talks: యూట్యూబర్స్ పై శివాజీ రాజా ఊహించని కామెంట్స్.. అప్పట్లో ఏం చేసేవారో తెలుసా అంటూ..?

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×