BigTV English

Dil Raju: దిల్ రాజుకు తెలంగాణా ప్రభుత్వం కీలక పదవి?

Dil Raju: దిల్ రాజుకు తెలంగాణా ప్రభుత్వం కీలక పదవి?

Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ ప్రొడ్యూసర్స్ లలో ముందుగా వినిపించే పేరు నిర్మాత దిల్ రాజు.. సినీ నిర్మాతగా మాత్రమే కాదు డిస్టిబ్యూటర్ గా కూడా వ్యవహారిస్తారు. ఈయన నిర్మాణంలో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. అయితే ఇప్పటివరకు దిల్ రాజు నిర్మాతగానే వ్యవహారిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఆయనకు కీలక పదివిని కట్టబెట్టే ఆలోచనలో ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం అటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ, ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..


విషయానికొస్తే.. ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌) ఛైర్మ‌న్‌గా దిల్ రాజును ఎంపిక చేసుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే వారు ఈ విషయంలో కీలక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్.. ప్రస్తుతం ఈ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదనే అసంతృప్తిలో రేవంత్ రెడ్డి ఉన్నారట. అందుకే ఇప్పుడు దిల్ రాజ్ కు ఆ భాధ్యతలను అప్పగించేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నప్పుడు వీటి పనులు అన్నీ బాగానే జరిగేవి అనే విమర్శలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నట్లు ఇన్సైడ్ టాక్. అందుకే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విభాగాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నారట. దిల్ రాజు అయితే ఈ పదవికి పెర్ఫెక్ట్ అని భావిస్తున్నారట..

Telangana government key post for Dil Raju?
Telangana government key post for Dil Raju?

ఇక సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు వచ్చినా దిల్ రాజు సామరస్యంగా వ్యవహారిస్తూ పరిష్కరిస్తాడు.. ఇటీవల వచ్చిన ఎన్నో సమస్యలను చాకచక్యంగా వ్యవహరించిన సాల్వ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక దాసరి తర్వాత దాసరి’ అనే పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. కొద్దిరోజుల క్రితం రేవంత్ రెడ్డి రాజు గారు మధ్య ఈ విషయమై చిన్నపాటి మీటింగ్ కూడా జరిగిందట.’ఎఫ్‌.డి.సి’కి ఛైర్మ‌న్‌గా ఉండ‌మ‌ని స్వ‌యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరడం జరిగిందట. కానీ దిల్ రాజు.. ఈ బాధ్యత తీసుకుంటే పూర్తిగా న్యాయం చేయగలనా…? సినిమా నిర్మాణాలు, ఇంకో వైపు ఫిల్మ్ ఛాంబ‌ర్ వ్య‌వ‌హారాలు వంటివి చాలానే ఉన్నాయి కదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారట..


రేవంత్ రెడ్డి అనుకున్నట్లు ఎఫ్డిసి పదవికి దిల్ రాజ్ బెస్ట్ చాయిస్ అని సినీ పెద్దలు కూడా భావిస్తున్నారని ఆలోచన. దిల్ రాజు వంటి వాళ్ళు ఈ విభాగాన్ని మరింత పటిష్టం చేసే అవకాశం ఉంటుందనేది అందరి నమ్మకం. మరి రాజుగారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. ఇకపోతే ప్రస్తుతం ఈయన స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తు బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఈయన నిర్మాణంలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. డిసెంబర్ రాబోయే సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి..

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×