E-Paper
Advertisement

Megastar: నెల రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్న చిరు.. దగ్గరుండి ఆ పని చేసిన సాయి తేజ్..!

Megastar: నెల రోజులుగా ఆ వ్యాధితో బాధపడుతున్న చిరు.. దగ్గరుండి ఆ పని చేసిన సాయి తేజ్..!
Advertisement

Megastar.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. 2024 ఏడాది పద్మ విభూషణ్ అవార్డు వరించగా.. ఇటీవల అక్కినేని శతజయంతి సందర్భంగా అక్కినేని అవార్డుకి కూడా ఎన్నికయ్యారు అంటూ అక్కినేని నాగార్జున (Nagarjuna ) ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh bachchan) చేతులమీదుగా చిరంజీవికి అక్టోబర్ 28వ తేదీన నిర్వహించే అక్కినేని శతజయంతి వేడుకలలో అందజేయనున్నారు. ఇక ఈ రెండు సంతోషాలలో మునిగి తేలుతున్న నేపథ్యంలో మరో అద్భుతమైన గౌరవం లభించడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు . ఈ గౌరవం ఒక్క మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా పరిశ్రమకు అని చెప్పాలి. తాజాగా గిన్నిస్ రికార్డుల్లో పేరు సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

537 పాటల్లో 24 వేల స్టెప్పులు..

Advertisement

డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్ తో డాన్స్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే 156 మూవీలలో 537 పాటల్లో 24 వేల స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కడంతో మెగా అభిమానులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఈ గౌరవాన్ని ఆయన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) చేతుల మీదుగా అందుకోవడం గమనార్హం.

నెల రోజులుగా అలాంటి వ్యాధితో బాధపడుతున్న చిరు..

Megastar: Chiru, who has been suffering from that disease for a month.
Megastar: Chiru, who has been suffering from that disease for a month.
Advertisement

ఇదిలా ఉండగా ఇంతటి శుభ పరిణామం వేళ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్త అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. అదేమిటంటే గత కొన్ని రోజులుగా చిరంజీవి ఒక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకే స్టేజ్ మీదకు కూడా వెళ్లలేని పరిస్థితిలో అటు అమీర్ ఖాన్ ఇటు ఆయన మేనల్లుడు సాయి ధరంతేజ్ సహాయం చేసిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి చికెన్ గున్యా తో గత 25 రోజులుగా బాధపడుతున్నారట. ఈ విషయాన్ని యాంకర్ వెల్లడించారు.

నిన్నటి రోజున హైదరాబాదులో సాయంత్రం వేళ స్టార్ హోటల్లో చిరంజీవికి సంబంధించిన ఈవెంట్ ని చాలా గ్రాండ్గా నిర్వహించారు.. అయితే ఇక్కడికి కూడా చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నప్పటికీ హాజరు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. ఈవెంట్ చేసిన హోస్ట్ చిరంజీవిని పైకి పిలుస్తూ.. గత 25 రోజులుగా చికెన్ గున్యా తో మెగాస్టార్ చిరంజీవి బాధపడుతూనే ఈవెంట్ కి వచ్చారు. ఇప్పుడిప్పుడే ఆయన కోరుకుంటూ మళ్ళీ అభిమానుల కోసం మన ముందుకు వచ్చారు అంటూ తెలిపింది. చిరంజీవి నీరసంగా ఈవెంట్ కి వచ్చినప్పటికీ ఫ్యాన్స్ కోసం యాక్టివ్ గా ఉంటూ ఈవెంట్ అంతా పాల్గొని సక్సెస్ చేశారు. దీంతో చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×