BigTV English

Actor Hema get bail: ఎట్టకేలకు హేమకు బెయిల్, కాకపోతే..

Actor Hema get bail: ఎట్టకేలకు హేమకు బెయిల్, కాకపోతే..

Actor Hema get bail: బెంగుళూరు రేవ్ పార్టీలో అరెస్టయిన తెలుగు సినీ నటి హేమకు బెయిల్ వచ్చింది. ఆమె బెయిల్ పిటీషన్‌పై బుధవారం బెంగుళూరు స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.


హేమ బెయిల్ పిటిషన్ సందర్భంగా ఇరువర్గాల మధ్య న్యాయస్థానంలో వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ జప్తు చేసుకోలేదని, ఘటన జరిగి పది రోజుల తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించాని హేమ తరపు న్యాయవాది మహేష్‌కిరణ్ శెట్టి కోర్టుకు వివరించారు. అంతేకాదు ఆమె పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై బెంగుళూరు పోలీసుల తరపు న్యాయవాది రియాక్ట్ అయ్యారు. బెంగుళూరు రేవ్ పార్టీకి సంబంధించి న డీటేల్స్ మొత్తం న్యాయమూర్తికి అందజేశారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార జైలులో ఉంది. బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు రానుంది.


మే 19న బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీ జరిగింది. పార్టీలో తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ నేతలు దాదాపు 200 మంది పాల్గొన్నారు. పోలీసుల దాడుల్లో కేవలం 103 మంది మాత్రమే దొరికారు. 73 మంది పురుషులు కాగా, 30 మహిళలు ఉన్నారు. అందరికీ టెస్టులు చేయించగా, 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. అందులో 59 మంది పురుషులు కాగా, 27 మంది మహిళలు ఉన్నారు.

మిగతావాళ్లు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. అందులోని కీలకంగా భావిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకున్నవాళ్లకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించారు. రేవ్ పార్టీ ఎవరిది? ఎవరెవరు వచ్చారు? డ్రగ్స్ సప్లై చేసిందెవరు? ఇలా రకరకాల ప్రశ్నలకు నిందితుల నుంచి సమాచారం రాబట్టారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×