E-Paper
Advertisement

Telugu Film Chamber Elections : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ప్రారంభం.. రేసులో ఉన్నది వీరే

Telugu Film Chamber Elections : ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ప్రారంభం.. రేసులో ఉన్నది వీరే
Advertisement

Telugu Film Chamber Elections : టాలీవుడ్ లో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ప్రారంభమయయాయి. హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజు పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈసారి అధ్యక్ష పదవికోసం ఠాగూర్ మధు, భరత్ భూషణ్ లు పోటీపడుతున్నారు. అలాగే ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి పోటీ చేస్తున్నారు.

మొత్తం 48 మంది సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టార్లో ఉన్న సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికలో 25 ఓట్ల మెజార్టీ ఓట్లు ఎవరికి వస్తాయో వారే ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా పగ్గాలు చేపడుతారు. కాగా.. ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతాయి. గతేడాది నిర్మాతల సెక్టార్ నుంచి పోటీ ఉండగా.. సి.కల్యాణ్ ప్యానల్ పై దిల్ రాజు 17 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడి ఎన్నికలు జరుగుతున్నాయి.

Advertisement

 

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×