BigTV English

Mammotti: పవన్ కళ్యాణ్ మూవీ ఆఫర్ కాలదన్నుకున్న మలయాళ సూపర్ స్టార్

Mammotti: పవన్ కళ్యాణ్ మూవీ ఆఫర్ కాలదన్నుకున్న మలయాళ సూపర్ స్టార్

Malayala Super Star Mammotti lost his Offer in pawan kalyan movie :మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఓ రేంజ్ కలెక్షన్స్ కనిపించేవి ఒకప్పుడు. రాజకీయాలలోకి వచ్చాక సినిమాలు తగ్గించుకున్నాడు గానీ రాక ముందు పవన్ డే్ట్స్ కోసం క్యూకట్టేవారు ప్రొడ్యూసర్లు. సెకండ్ హీరోయిన్లు కూడా పవన్ తో ఒక్క షాట్ లో నటిస్తే చాలు తమ కెరీర్ మలుపు తిరుగుతుందని భావించేవారు. పవన్ హీరోగా నటించేందుకు బ్లాంక్ చెక్కులతో నిర్మాతలు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పటికీ నిర్మాతలు పవన్ ని అంతలా కోరుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో అర్థం అవుతుంది. కెరీర్ పీక్ దశలో ఉండగా పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టిని సంప్రదించారట అల్లు అరవింద్. ముమ్ముట్టి అల్లు అరవింద్ కు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకని పవన్ కు ప్రతి నాయకుడిగా ముమ్ముట్టి ఆ పాత్రకు న్యాయం చేస్తారని నిర్మాతలు భావించారు. పైగా ముమ్ముట్టి ఉండటంతో మలయాళ మార్కెట్ తో సహా మిగిలిన అన్ని భాషల్లొనూ మంచి బిజినెస్ అవుతుందని భావించారు నిర్మాతలు.


ముమ్ముట్టి క్రేజ్ అట్లుంటది..

ముమ్ముట్టి కూడా సౌత్ లో అన్ని భాషలతో సహా బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. చాలా కాలంగా మలయాళ చిత్ర సీమను శాసిస్తున్నారు. ఆరు పదులు దాటినా ఎవర్ గ్రీన్ హీరోగా అతని పేరు చెక్కు చెదరలేదు. ముమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా అగ్రహీరోగా చెలామణి అవుతున్నారు. తెలుగులోనూ మహానటి, సీతారామం మూవీస్ తో టాలీవుడ్ లో తన మార్కెట్ రేంజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించాలని అల్లు అరవింద్ ముమ్ముట్టిని కోరారట. అయితే అందుకు సున్నితంగా ఈ ఆఫర్ ని వదిలేసుకున్నారట ముమ్ముట్టి. ఇటీవల ఓ సినిమా వేడుకలో ఈ విషయాన్ని అల్లు అరవింద్ బయటపెట్టారు.


పాత్ర నచ్చలేదని ..

తనకు పవన్ తో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని..కాకపోతే విలన్ పాత్ర తనకి నచ్చలేదని..అంతగా హుందాగా లేదని..దీని వలన తనకు వచ్చే చెడ్డ పేరు గురించే ఆలోచిస్తున్నానన్నానని..అరవింద్ తో చెప్పి ఆ మూవీలో నటించలేదని అన్నారన్నారు. అయితే ఆ సినిమా పేరు మాత్రం అల్లు అరవింద్ ప్రస్తావించకపోయినా ఫ్యాన్స్ మాత్రం అది పవన్ నటించిన జల్సా అనుకుంటున్నారు. అందులో ముఖేష్ ఋషి పాత్రకు సంబంధించి ముందుగా ముమ్ముట్టిని అడిగి ఉంటారని వాస్తవానికి ఆ పాత్ర నిడిడి కూడా సినిమాలో తక్కువగానే ఉండటంతో ముమ్ముట్టి ఆ ఆఫర్ ని తిరస్కరించివుండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలోపోస్టుులు పెడుతున్నారు.

ప్రాధాన్యతలేని పాత్ర..

ముమ్ముట్టి లాంటి ఇండస్ట్రీని శాసించే నటుడితో అలాంటి పాత్రలు చేయిద్దామనే ఆలోచనే తప్పని ..అలా ఏవి పడితే అవి ఒప్పుకుంటే ఆయన సూపర్ స్టార్ ఎలా అవుతాడని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలు, ఇటు సినిమా రంగంలో బిజీగా ఉన్పప్పటికీ పెండింగ్ సినిమాలు పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నారు. తన వలన ఏ నిర్మాతా నష్టపడకూడదని తాను కమిట్ అయిన సినిమాలను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×