BigTV English
Advertisement

Corporate education for Poor Students: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తాం: రేవంత్ రెడ్డి

Corporate education for Poor Students: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తాం: రేవంత్ రెడ్డి

Corporate Education will be Provided to Poor Students: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కూకట్‌పల్లి జేఎన్టీయూలో క్వాలిటీ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక భారంతో రాష్ట్రం కొంత ఇబ్బందుల్లో ఉందన్నారు. బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామన్నారు. ఎన్నికల హడావుడి ముగిసింది.. ఇప్పుడిప్పుడే పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించామన్నారు.


ప్రస్తుత విద్య సంవత్సరం నుంచి ఫిజు రీయింబర్స్ మెంట్ బకాయిలు లేకుండా చూస్తామంటూ సీఎ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంజినీరింగ్ కాలేజీలు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నిరుద్యోగులను తయారు చేసే పరిశ్రమలుగా కాలేజీలు ఉండకూడదన్నారు.

ప్రభుత్వ విధానాలు అందరికీ తెలిసేలా ప్రస్తుత కార్యక్రమం ఉందని ఆయన అన్నారు. ప్రతి విషయంలో ప్రభుత్వ విధానం కీలకమంటూ సీఎం స్పష్టం చేశారు. మ్యాన్ మేడ్ వండర్స్ ను క్రియేట్ చేసిందే ఇంజినీర్లు అని సీఎం కొనియాడారు. ప్రపంచంలోని దేశాల్లో గొప్పగా ఏదైనా ఉంటే దాన్ని చేసింది ఇంజినీర్లే అని రేవంత్ రెడ్డి అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశానికి అత్యంత అవసరమైంది సివిల్ ఇంజినీరింగ్ అని సీఎం నొక్కి చెప్పారు.


పలు కాలేజీల్లో సివిల్ ఇంజినీరింగ్ ను లేకుండా చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సులను కచ్చితంగా నడపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మూడు కోర్సులు లేకపోతే దేశం ప్రమాదాన్ని ఎదుర్కుంటదంటూ ఆయన హెచ్చరించారు. ఉద్యోగాలు సృష్టించే సంస్థలుగా కాకుండా మేధావులను అందించే సంస్థలుగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.

తొలిసారిగా ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జీఎన్ టీయూ పరిధిలో కళాశాలలు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రభుత్వ విధానం గురించి తెలవాలని సీఎం అన్నారు. లక్ష మంది ఇంజినీరింగ్ పట్టాలు పొందినవారికి ప్రభుత్వ విధానం తెలుస్తుందన్నారు.

Also Read: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి..

గత ముఖ్యమంత్రులు తీసుకున్న విధానాల వల్ల మనం ఐటీ, ఫార్మా రంగాల్లో ముందు ఉన్నామన్నారు. భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులు ఉండాలంటూ సీఎం సూచించారు. 60 లక్షల నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి ఉపాధి పొందుతున్నారన్నారు. ఫార్మా, ఐటీ తరువాత ఏఐ ప్రపంచాన్ని నడిపించబోతుందన్నారు. రాష్ట్రంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాలన్నారు. ఏఐకి సంబంధించిన కోర్సులు ప్రవేశపెడితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. త్వరలోనే స్కిల్ డెవలెప్ మెంట్ యూనివర్సిటీకి అటానమస్ హోదా ఇస్తామన్నారు. పక్క రాష్ట్రాలతో పోటీ పడే విధంగా కాకుండా ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనం తయారు కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తుందన్నారు.

నిరుద్యోగులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారమే గ్రూప్-1 మిగతా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Global Summit
Global Summit

‘నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు. నిబంధనలు మార్చితే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ, కోర్టు కేసుల వల్ల మళ్లీ పరిస్థితి మొదటికొస్తుంది. రెండు సంవత్సరాల క్రితం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడా డీఎస్సీ నిర్వహిస్తుంటే వాటిని వాయిదా వేయాలని కోరుతున్నారు. కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు వెనుక ఉండి నడిపిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్న ముగ్గురిపై ఆరా తీశా. వాళ్లకు పరీక్షలకు ఏం సంబంధంలేదు. విద్యా వ్యవస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు. పరీక్షల నిర్వహణ విషయంలో కఠినంగా వెళ్తున్నాం.

గ్రూప్-1 ప్రిలిమ్స్ విజయవంతంగా నిర్వహించాం. 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తామని చెప్పాం. కానీ, ఇప్పుడు కొంతమంది 1:100 చేయాలని అడుగుతున్నారు. అలా చేస్తే కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది’ అంటూ సీఎం పేర్కొన్నారు.

Related News

Cyber Crimes: సైబర్ నేరాలు తీవ్ర సామాజిక సమస్య.. ఇది ఉద్యమంగా మారాలి: డీజీపీ శివధర్ రెడ్డి

Cold Wave Alert: తెలంగాణకు తీవ్ర చలి హెచ్చరిక.. సింగిల్ డిజిట్‌కు పడిపోనున్న ఉష్ణోగ్రతలు!

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Big Stories

×