Tollywood Movies : టాలీవుడ్ ఇండస్ట్రీలో బోలెడు సినిమాలు ఫాదర్ చుట్టు తిరిగే కథలతో ప్రేక్షకులను పలకరించాయి. అందులో కొన్ని సినిమాలు అయితే కన్న తండ్రి మనకోసం ఎన్ని ఇబ్బందులను పడుతున్నాడో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి రియల్ హీరో. కుటుంబాన్ని నడిపించేది, ఎలాంటి లోటు లేకుండా చూసుకునేది తండ్రి మాత్రమే.. ఫాధర్స్ డే సందర్బంగా ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాలు ఏవో ఒకసారి గుర్తుచేసుకుందాం..
సూర్యవంశం..
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన నటించిన ఆణిముత్యం లాంటి సినిమాల్లో ఒకటి సూర్యవంశం.. తండ్రి మనస్సు దోచుకునే కొడుకు పాత్రను వెంకటేష్ అద్భుతంగా పోషించారు. తండ్రి ఇష్టం లేని కొడుకు ఎలా తన ప్రేమను పొందాడో చూపిస్తూ, తండ్రి సెంటిమెంట్‌కు నిండి ఉండే చిత్రం..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు..
వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. తండ్రిని గౌరవించే సంస్కారం, అన్నదమ్ముల బంధం ఎమోషనల్‌గా నడిచే ప్యాకేజీ. వెంకటేష్ తన పాత్ర ద్వారా పెద్ద అన్నగా తండ్రి స్థానంలో మానవతను ప్రతిబింబించారు. ఈ మూవీ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి కుటుంబంలో పుట్టాలి అన్నట్లు సినిమాలో చూపించారు.
బొమ్మరిల్లు..
భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తండ్రి పాత్ర ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉంటుంది. తన కొడుకు ఎదిగినా, అతని జీవితంపై తన నియంత్రణ కొనసాగిస్తుంటాడు తండ్రి. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయి నటించారు..పెళ్లి విషయంలో తండ్రి మాటను పక్కనపెట్టిన కొడుకు గా ఉన్న చివరకు తండ్రి మనసు గెలుచుకొని ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకుంటాడు.
నాన్నకు ప్రేమతో..
ఈ మూవీలో ఎన్టీఆర్ నాన్న గొప్పతనం గురించి చక్కగా చెప్పాడు. నాన్న రియల్ హీరోగా చూపించారు. తండ్రి ఆస్తి కోల్పోయినప్పుడు, కొడుకు తన ప్రతిభను ఉపయోగించి దాన్ని తిరిగి సాధించాలనే సంకల్పంతో ప్రయాణం మొదలుపెడతాడు. ప్రేక్షకుల మనసు దోచుకున్న అద్భుతమైన మూవీ.
సన్నాఫ్ సత్యమూర్తి..
ఈ చిత్రంలో అల్లు అర్జున్ తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యతను తీసుకుంటాడు. తన తండ్రి మరణించినప్పటికీ భూ వివాదంలో చెడ్డపేరు రాకూడదని అల్లు అర్జున్ ఆ ఒక్కడు కూడా మా నాన్నను గ్రేట్ అనాలి అని ప్రాణాలను తెగించి ముందుకు వస్తాడు. కన్నీళ్లు పెట్టుకొనే ఎమోషనల్ డైలాగులు ఈ మూవీలో ఉంటాయి.
యానిమల్..
బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాల్లో రీసెంట్ మూవీ యానిమల్.. తండ్రి కోసం ఏదైన చేసే కొడుకు.. ఈ సినిమాలో కన్నతండ్రి మీద వచ్చే సాంగ్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ రాబోతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చాయి. హాయ్ నాన్న, డాడీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. వంటి తెలుగు సినిమాల్లో నాన్న గొప్పతనం గురించి చక్కగా వివరించారు.