BigTV English
Advertisement

OTT Movie : టెర్రరిస్టులకు చుక్కలు చూపించే లేడీ సింగం … ఒక్కొక్కరినీ ఒక్కో స్టైల్లో వేటాడేసింది

OTT Movie  : టెర్రరిస్టులకు చుక్కలు చూపించే లేడీ సింగం … ఒక్కొక్కరినీ ఒక్కో స్టైల్లో వేటాడేసింది

OTT Movie : లండన్‌లోని ఒక ఎత్తైన భవనంలో, జోయి అనే మాజీ సైనికురాలు విండో క్లీనర్‌గా జాబ్ చేస్తుంటుంది. 50 అంతస్తుల ఎత్తులో పైన నిలబడి ధైర్యంగా పనిచేస్తుంది. ఆమె తమ్ముడు మైఖేల్ కూడా ఆ చోటికి వస్తాడు. అదే సమయంలో ఒక రాడికల్ యాక్టివిస్ట్ గ్రూప్ ఈ భవనంలో, ఒక కంపెనీకి చెందిన 300 మందిని బందీలుగా తీసుకుంటుంది. వీళ్ళ లక్ష్యం కంపెనీ లొసుగులను బయటపెట్టడం. కానీ ఒక ఎక్స్‌ట్రీమిస్ట్ నాయకుడు అందరినీ చంపాలని ప్లాన్ చేస్తాడు. బయట 50 అంతస్తుల ఎత్తులో ఉన్న జోయి, తన తమ్ముడిని, బందీలను కాపాడే ప్రయత్నం చేస్తుంది. జోయి 300 మందిని కాపాడుతుందా ? ఆమె కూడా బంధీగా చిక్కుతుందా ? ఈ మూవీ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వైతే ..


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ లండన్‌లోని వన్ కెనడా స్క్వేర్‌లో, కేనరీ వార్ఫ్‌లో జరుగుతుంది. జోయి లాక్ (డైసీ రిడ్లీ) ఒక మాజీ స్పెషల్ రికనైసెన్స్ రెజిమెంట్ సైనికురాలు. ఒక సహచరుడిని కొట్టినందుకు తనని సస్పెండ్ చేయడంతో, సైన్యాన్ని వదిలేసి ఇప్పుడు విండో క్లీనర్‌గా పనిచేస్తుంది. ఆమె బాల్యంలో తన తండ్రి టార్చర్ నుండి తప్పించుకోవడానికి వాల్-క్లైంబింగ్ నేర్చుకుంది. ఇది ఆమెకి ప్రస్తుత ఉద్యోగంలో ఉపయోగపడుతుంది. ఆమె తమ్ముడు మైఖేల్ (మాథ్యూ టక్), కేర్ హోమ్‌లలో అవినీతిని బయటపెట్టే ఒక ఆన్‌లైన్ క్రూసేడర్. ఆమెను రోజు కలుస్తుంటాడు. జోయి తన సహోద్యోగి నోహ్ (టాజ్ స్కైలర్)తో కలిసి 50 అంతస్తుల ఎత్తులో విండోలు క్లీన్ చేస్తుండగా, మైఖేల్ అనుకోకుండా ఆమెను కలవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఆ భవనంలో చిక్కుకుంటాడు.


అదే సమయంలో అగ్నియన్ ఎనర్జీ కంపెనీకి చెందిన ఒక షేర్‌హోల్డర్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది.  “ఎర్త్ రివల్యూషన్” అనే ఎన్విరాన్‌మెంటల్ యాక్టివిస్ట్ గ్రూప్, స్లీపింగ్ గ్యాస్ క్యానిస్టర్లతో భవనాన్ని హైజాక్ చేస్తుంది. వీళ్ళు కంపెనీ యజమానుని తో సహా 300 మందిని బందీలుగా తీసుకుంటారు. గ్రూప్ లీడర్ మార్కస్ బ్లేక్ (క్లైవ్ ఓవెన్) కంపెనీకి చెందిన సెక్రెట్స్ బయట పెట్టాలనుకుంటాడు. కానీ నోహ్ అనే రాడికల్, బందీలకు బాంబులు అమర్చి అందరినీ చంపాలని ప్లాన్ చేస్తాడు. సైన్యంలో సస్పెండ్ అయిన జోయి భవనంలోకి చొరబడి, తన తమ్ముడిని ఇతర బందీలను కాపాడే ప్రయత్నం చేస్తుంది. చివరికి నోహ్ నిజమైన ఎజెండా ఏమిటి ? జోయి బాంబులను ఎలా నిర్వీర్యం చేస్తుంది? మైఖేల్ ఆన్‌లైన్ క్రూసేడింగ్ హాస్టేజ్ సిచుయేషన్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలను, ఈ బ్రిటిష్ యాక్షన్-థ్రిల్లర్ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : దెయ్యం వేసే స్కెచ్ కి బలయ్యే రివ్యూయర్ … ఓటీటీని దడ దడ లాడిస్తున్న సంతానం సినిమా

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ బ్రిటిష్ యాక్షన్-థ్రిల్లర్ మూవీ పేరు ‘క్లీనర్’ (Cleaner). 2025 లో వచ్చిన ఏ సినిమాకు మార్టిన్ కాంప్‌బెల్ దర్శకత్వం వహించారు.ఈ మూవీ 2025 ఫిబ్రవరి 21 న అమెరికాలో థియేటర్లలో విడుదలైంది. ఇందులో డైసీ రిడ్లీ, మాథ్యూ టక్,టాజ్ స్కైలర్,క్లైవ్ ఓవెన్ వంటి నటులు నటించారు. హెచ్‌బీవో మ్యాక్స్ (HBO Max) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×