E-Paper
Advertisement

OTT Movie : కంపెనీ యజమానితోనే డేటింగ్ కి ప్లాన్ … ఈ అమ్మాయి యాక్టింగ్ కి ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

OTT Movie : కంపెనీ యజమానితోనే డేటింగ్ కి ప్లాన్ … ఈ అమ్మాయి యాక్టింగ్ కి ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
Advertisement

OTT Movie : షిన్ హా-రీ, ఒక సాధారణ ఆఫీస్ ఉద్యోగి. ఆమె ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుంది. ఆమె స్నేహితురాలు జిన్ యంగ్ సలహా మేరకు ఒక బ్లైండ్ డేట్‌కు వెళ్తుంది. అక్కడ తనను తాను యంగ్-సియోగా చెప్పుకుంటుంది. కానీ ఆ డేట్‌లో ఆమె తన కంపెనీ CEO నే కలుస్తుంది. అయితే అతను ఎవరో ఆమెకు తెలీకపోవడంతో, ఆమె యంగ్-CEO పాత్రలో మునిగిపోతుంది. ఇక ఈ స్టోరీ గందరగోళంగా కామెడీ కంటెంట్ తో నడుస్తుంది. చివరికి షిన్ హా-రీ ఈ పరిస్థితిని ఎలా హాండిల్ చేస్తుంది ? ఆమె డేటింగ్ సక్సెస్ అవుతుందా ? మరేమైనా అడ్డంకులు వస్తాయా ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

స్టోరీలోకి వెళితే

Advertisement

కాంగ్ తై-మూ పనిలో పర్ఫెక్షనిస్ట్. అంతే కాకుండా చల్లని వ్యక్తిత్వం కలిగిన CEO గా పేరు ఉంటుంది. తన తాత ఒత్తిడి వల్ల వివాహం కోసం ఒక బ్లైండ్ డేట్‌కు వెళ్తాడు. హా-రీ అనే అమ్మాయి నిజస్వరూపం తెలియకుండా, అతను ఆమె పట్ల ఇస్టం పెంచుకుంటాడు.ఆమె తనని తాను ఒక కంపెనీ CEO గా పరిచయం చేసుకుంటుంది. ఈ పరిస్థితి హా-రీని ఒక డబుల్ గేమ్ ఆడేలా చేస్తుంది. ఆఫీసులో సాధారణ ఉద్యోగిగా, బ్లైండ్ డేట్‌లో యంగ్-సియోగా ఉండాల్సి వస్తుంది. ఈ గందరగోళం కామెడీ సన్నివేశాలకు దారితీస్తుంది. అదే సమయంలో చా సంగ్-హూన్ (తై-మూ సెక్రటరీ) జిన్ యంగ్ అనే మరో జంట మధ్య ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది. సిరీస్ కామెడీ , రొమాన్స్, కార్పొరేట్ జీవితంలోని డైనమిక్స్‌ను సమతుల్యం చేస్తుంది. హా-రీ, తై-మూ మధ్య కెమిస్ట్రీ, యంగ్-సియో, సంగ్-హూన్ సరదా సన్నివేశాలు, కుటుంబ ఒత్తిళ్లు సిరీస్‌ను ఇంట్రెస్టింగ్ గా ఉంచుతాయి. విమర్శకులు ఈ సిరీస్‌ను దాని ఫీల్-గుడ్ వైబ్, బలమైన నటనల కోసం ప్రశంసించారు. చివరికి షిన్ హా-రీ తన నకిలీ గుర్తింపును ఎంతకాలం కాపాడుకోగలదు? కాంగ్ తై-మూ ఆమె ఎవరో కనిపెట్టినప్పుడు ఏమవుతుంది? ఆమె కుటుంబ ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్నలకు సమమాధానాలు ఈ వెబ్ సిరీస్‌ ను చూసి తెలుసుకోండి.

Read Also : సమాధి కోసం సాహస యాత్ర … శాపం కోసం పడరాని పాట్లు … అదిరిపోయే అడ్వెంచర్ మూవీ

Advertisement

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ కొరియెన్ వెబ్ సిరీస్ పేరు ‘ ఏ బిజినెస్ ప్రపోజల్’ (A Business Proposal). ఇది పార్క్ సీయోన్ దర్శకత్వంలో రూపొందింది. ఈ సిరీస్‌లో అహన్ హ్యో-సియోప్ (కాంగ్ తై-మూ), కిమ్ సే-జియాంగ్ (షిన్ హా-రీ), కిమ్ మిన్-క్యూ (చా సంగ్-హూన్), సియోల్ ఇన్-ఆ (జిన్ యంగ్-సియో) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌ Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది. సీజన్ 1, 12 ఎపిసోడ్‌లతో ఉంది. సీజన్ 2 గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. ఈ సిరీస్ కహాంగ్సు అనే వెబ్‌టూన్ ఆధారంగా రూపొందింది.

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×