BigTV English
Advertisement

Telugu States Top2 business Film’s: ప్రీ రిలీజ్ లో అత్యధిక బిజినెస్ జరుపుకున్న చిత్రాలు ఇవే..!

Telugu States Top2 business Film’s: ప్రీ రిలీజ్ లో అత్యధిక బిజినెస్ జరుపుకున్న చిత్రాలు ఇవే..!

Telugu States Top2 Business Film’s..ఈ మధ్యకాలంలో ప్రతి హీరో కూడా పాన్ ఇండియా వైడ్ గా తన సినిమాను రిలీజ్ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు బడ్జెట్ కూడా భారీ రేంజ్ లో కేటాయిస్తూ.. అన్ని భాషలలో విడుదల చేస్తూ సక్సెస్ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలను మొదులుకొని ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా బాక్సాఫీస్ ను టార్గెట్ గా చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఆ సినిమాలకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతే జరగాల్సి ఉంటుంది. అప్పుడే సినిమా నిర్మాతలు సేఫ్ అవుతారు. లేకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో ఇటీవల తెరకెక్కిన చిత్రాలకు ప్రీ రిలీజ్ లో కూడా భారీగానే జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో తమ చిత్రాలను తెరకెక్కించారు. కానీ ఆ చిత్రాలకు అనుకున్న స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదని చెప్పాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరగాలి అంటే సినిమా పై హైప్ కూడా పెరగాలి. ప్రమోషన్స్ బాగా చేపట్టాలి. అప్పుడే బిజినెస్ బాగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసి ప్రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసుకున్నారు. తాజాగా సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప -2 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుందంటూ అందుకు సంబంధించిన లెక్కలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక బిజినెస్ జరుపుకున్న చిత్రాలు వైరల్ అవుతుండగా.. అందులో టాప్ -2 లో నిలిచాయి. ఆ రెండు చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి (Rajamouli)బాహుబలి(Bahubali ) సినిమాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) సంయుక్తంగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆస్కార్ బరి లో దిగి రెండు విభాగాలలో ఆస్కార్ కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల విషయానికి వస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ప్రాంతాల వారీగా నిజాం – రూ. 80 కోట్లు
సీడెడ్ – రూ.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 23 కోట్లు
ఈస్ట్ గోదావరి – రూ. 18 కోట్లు
వెస్ట్ గోదావరి – రూ. 16 కోట్లు
గుంటూరు – రూ. 14 కోట్లు
కృష్ణ – రూ.14 కోట్లు
నెల్లూరు – రూ.9 కోట్లు
మొత్తంగా – రూ. 224 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక పుష్ప 2 విషయానికి వస్తే.. సుకుమార్ (Sukumar )దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా గతంలో పుష్ప సినిమా విడుదలై అల్లు అర్జున్ కు పాన్ ఇండియా గుర్తింపును అందించింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఆ సినిమాకి సీక్వెల్ గా పుష్ప -2 డిసెంబర్ 6న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంది.
నిజాం – రూ. 80 కోట్లు
సీడెడ్ – రూ.30కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 23.4కోట్లు
ఈస్ట్ గోదావరి – రూ.14.4 కోట్లు
వెస్ట్ గోదావరి – రూ. 10.8 కోట్లు
గుంటూరు – రూ. 15.3 కోట్లు
కృష్ణ – రూ.12.6 కోట్లు
నెల్లూరు – రూ.7.2కోట్లు
మొత్తంగా – రూ. 193.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


మొత్తానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలకు ముందే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రాలుగా ఆర్ఆర్ఆర్, పుష్ప -2 చిత్రాలు నిలిచాయి.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×