E-Paper
Advertisement

Sunny Deol: రవితేజతో మిస్ అయ్యి సన్నీతో స్టార్ట్ అయిన మూవీ.. టైటిల్ ఏంటంటే.?

Sunny Deol: రవితేజతో మిస్ అయ్యి సన్నీతో స్టార్ట్ అయిన మూవీ.. టైటిల్ ఏంటంటే.?
Advertisement

Sunny Deol: గత కొన్నేళ్లుగా ఎంతోమంది తెలుగు డైరెక్టర్లు.. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సినిమాలు చేయడం కామన్ అయిపోయింది. అలా నార్త్, సౌత్ అని తేడా లేకుండా కథకు ఏ హీరో సెట్ అవుతాడో ఆ హీరోతోనే మూవీ చేయడానికి డైరెక్టర్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్‌తో తెలుగు మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా అనగానే ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎన్నో ఏళ్లుగా హిందీలో హీరోగా నటిస్తున్న సన్నీ డియోల్.. తెలుగులో మాత్రం ఇప్పటివరకు అడుగుపెట్టలేదు. ఇప్పుడు గోపీచంద్ మలినేని మూవీతో తెలుగు డెబ్యూకు సిద్ధమవుతుండగా.. దీని టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు మేకర్స్.

పుట్టినరోజు సందర్భంగా

Advertisement

గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి ముందుకొచ్చింది. మైత్రీతో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా దీని నిర్మాణంలో భాగమయ్యింది. అక్టోబర్ 19న సన్నీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ అయ్యింది. దీనికి ‘జాట్’ (Jaat) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. టైటిల్‌తో పాటు ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా కాస్త వెరైటీగానే ఉంది. ఇదొక కమర్షియల్ యాక్షన్ మూవీ అని ప్రేక్షకులకు ముందు నుండే డౌట్ ఉన్నా.. ఈ ఫస్ట్ లుక్‌తో పక్కా క్లారిటీ ఇచ్చేశాడు గోపీచంద్ మలినేని.

Also Read: చిరంజీవికి అక్కగా, అమ్మగా, లవర్‌గా నటించిన ఒకేఒక్క హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?

Advertisement

రెండు భాషల్లో

‘జాట్’ ఫస్ట్ లుక్‌లో ఫ్యాన్‌తో ఫైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తాడు సన్నీ డియల్ (Sunny Deol). మామూలుగా సినిమాల కోసం వెరైటీ ఆయుధాలు తయారు చేసి వాటితో ఫైట్ చేయడం కామన్ అనుకున్నారో ఏమో.. అందుకే వెరైటీగా ఫ్యాన్‌తో ఫైట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ కాంబినేషన్, ఈ టైటిల్, ఈ ఫస్ట్ లుక్.. అన్నీ వెరైటీగానే ఉన్నాయని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. కానీ మంచి యాక్షన్‌తో ఎంటర్‌టైన్ చేస్తే అదే చాలు అనుకుంటున్నారు. అసలైతే ఈ సినిమాను రవితేజతో చేయాల్సిన మలినేని.. చివరికి సన్నీ డియోల్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. తెలుగుతో పాటు ఈ మూవీ.. హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కుతోంది. రెండు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ‘జాట్’.

భారీ అంచనాలు

‘జాట్’లో సన్నీ డియోల్ హీరోగా నటిస్తుండగా మరో బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా ఇందులో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. ‘ఎస్‌డీజీఎమ్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ ప్రారంభమయ్యింది. ఇప్పటికే గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహించిన చాలావరకు సినిమాలు కమర్షియల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘జాట్ కూడా అలాగే ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. చాలాకాలంగా హీరోగా సన్నీ డియోల్‌కు అవకాశాలు, హిట్స్.. రెండూ లేవు. కానీ గతేడాది విడుదలయిన ‘గదర్ 2’తో రికార్డులను బ్రేక్ చేసే హిట్ కొట్టాడు. దీంతో ‘జాట్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×