BigTV English

Oscar: కాంతార, RRR, కశ్మీర్ ఫైల్స్.. ఆస్కార్‌ రేసులో 10 భారతీయ సినిమాలు..

Oscar: కాంతార, RRR, కశ్మీర్ ఫైల్స్.. ఆస్కార్‌ రేసులో 10 భారతీయ సినిమాలు..

Oscar: కొన్నేళ్లుగా ఇండియన్ సినిమా దుమ్ము రేపుతోంది. పాన్ ఇండియా సినిమాలతో అదరగొడుతోంది. బాహుబలి నుంచి మొదలైంది ఈ జోరు. కేజీఎఫ్ తో పీక్స్ కు చేరింది. పుష్ప, కాంతారాలు పూనకాలు తెప్పించాయి. కశ్మీరీ ఫైల్స్ ప్రజాదరణ చూరగొంది. ఇలా వరుసబెట్టి అనేక చిత్రాలు భారత్ లో కేక పెట్టించాయి. మన సినిమాల జోరు ఆస్కార్ వరకూ కొనసాగుతోంది. తాజాగా, ఆస్కార్ అవార్డుల రేసులో ఏకంగా 10 భారతీయ సినిమాలు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి.


అవార్డుల కోసం నామినేషన్స్‌ బరిలో నిలిచిన సినిమాల జాబితాను ఆస్కార్స్‌ ప్రకటించింది. ఆస్కార్ కోసం భారత్ నుంచి అధికారికంగా ‘ది ఛల్లో షో’ను పంపగా.. మరో 10 చిత్రాలు సైతం సొంతంగా రేసులో నిలిచాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కాంతార’, ‘కశ్మీరీ ఫైల్స్‌’, ‘విక్రాంత్‌ రోణ’, ‘గంగూభాయి కతియావాడి’, ‘మి వసంతరావ్‌’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘రాకెట్రీ’, ‘ఇరవిన్‌ నిళల్‌’ చిత్రాలు ఓపెన్‌ కేటగిరిలో నిలవడం ఆసక్తికరం.

రిషబ్‌శెట్టి నటించిన ‘కాంతార’ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్లకు అర్హత సాధించింది. ఈ విషయం హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ లో వెల్లడించింది. ‘‘కాంతార సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్లకు అర్హత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహంతోనే ఇదంతా సాధ్యమైంది. ఆస్కార్‌ ఫైనల్‌లోనూ కాంతార సత్తా చాటాలని కోరుకుంటున్నాం’’ అంటూ హోంబలే ట్వీట్ చేసింది.


కాంతార, ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్, విక్రాంత్ రోణ.. ఇలా రికార్డ్ కలెక్షన్లు వసూలు చేసిన ఆయా చిత్రాలు ఆస్కార్ అవార్డులనూ సాధించాలని భారతీయులంతా కోరుతున్నారు. ఆ మేరకు నెటిజన్లు సోషల్ మీడియాలో విషెష్ చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 301 సినిమాలు అవార్డుల కోసం పోటీ పడుతున్నాయి. 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన చిత్రాలను జనవరి 24న ప్రకటిస్తారు. మార్చి 12న అవార్డ్స్ ప్రదానం చేస్తారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×