Curd Facial For Skin: ముఖం తెల్లగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఇందుకోసం అమ్మాయిలు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అందం కోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా లేకపోలేదు. అయితే ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం ముఖ్యం. ముఖ్యంగా పెరుగుతో తయారు చేసిన హోం రెమెడీస్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. పెరుగు అందాన్ని రెట్టింపు చేయడంలో ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పెరుగుతో ఇంట్లోనే ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మెరిసే చర్మం కోసం పెరుగు ఫేషియల్ :
పెరుగు, తేనె సహజమైన, ప్రభావ వంతమైన హోం రెమెడీస్. వీటి సహాయంతో మీరు మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. రాత్రిపూట పెరుగు, తేనెతో తయారు చేసిన ఫేస్ మాస్క్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి తగినంత పోషణ లభిస్తుంది. అంతే కాకుండా చర్మ సంబంధిత అనేక సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖానికి పెరుగు ఫేషియల్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
పెరుగు, తేనె యొక్క ప్రయోజనాలు:
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది : పెరుగు, తేనె కలిసి చర్మాన్ని లోతుగా తేమగా చేస్తాయి. ఇది తాజాగా, హైడ్రేటెడ్, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
చర్మ సమస్యలను తగ్గిస్తుంది : ఈ రెండు మిశ్రమాలు చర్మపు మచ్చలు, మొటిమలు, ముడతలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి.
చర్మాన్ని మృదువుగా చేస్తుంది : పెరుగు, తేనె చర్మ కణాలను పోషించి, చర్మాన్ని మృదువుగా, సరళంగా మారుస్తాయి. డ్రై స్కిన్ ఉన్న వారు దీనిని తరచుగా వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
యాంటీఆక్సిడెంట్ లక్షణాలు : తేనెలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని బాహ్య కాలుష్యం, హానికరమైన అంశాల నుండి రక్షిస్తాయి. అంతే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది చేస్తాయి.
చర్మాన్ని శుభ్రపరచడం : పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి మొటిమలు, నల్లటి మచ్చలను నయం చేస్తుంది. అంతే కాకుండా మృత కణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ముఖంపై పేరుకు పోయిన జిడ్డును తొలగించడంలో కూడా ఈ ఫేషియల్ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముఖానికి అవసరం అయిన పోషణను కూడా అందిస్తుంది,
చర్మ రంగును మెరుగుపరుస్తుంది : పెరుగు, తేనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మపు రంగును ప్రకాశవంతం చేస్తుంది. అంతే కాకుండా రంగు మారిన నల్లటి చర్మాన్ని తెల్లగా మార్చడంలో కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
Also Read: మందార పూలను ఇలా వాడితే.. జుట్టు జెట్ స్పీడ్‌లో పెరుగుతుంది
పెరుగు, తేనె ఫేషియల్ ఎలా ?
-2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని దానికి 1 టీస్పూన్ తేనె కలపండి.
-రెండు పదార్థాలను బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి.
-ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి.
– తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి చర్మాన్ని ఆరబెట్టండి.