Game Changer third Single : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మితమవుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఒకటి. ఈ సినిమా సంక్రాంతి కనుక జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి రెండు పాటలను రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. రెండు సాంగ్స్ కూడా మంచి మాస్ బీట్స్. ప్రస్తుతం ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ కూడా రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇక ఈ పాట మెలోడీగా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటివరకు వచ్చిన రెండు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్ కి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. తమన్ మాస్ సాంగ్స్ కొట్టడమే కాకుండా మంచి మెలోడీ సాంగ్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఇచ్చాడు.
ఈ సాంగ్ నవంబర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు తమన్ తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. నేను ఈ మెలోడీ సాంగ్ తో ట్రిప్ అవుతున్నాను. పాట మిమ్మల్ని ఒకసారి కొత్త ప్రపంచానికి తీసుకెళ్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటూ తెలిపాడు. దీనిని మరో అద్భుతం లా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు అంటూ తెలిపాడు. అలానే ఈ పాట నా మైలేజ్ ని పెంచింది అని చెప్పుకొచ్చాడు. శంకర్ సినిమాలలో కొన్ని సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక సాంగ్ ని చాలా గ్రాండ్ ఇయర్ గా చూపిస్తాడు శంకర్. ఇలా శంకర్ సినిమాల్లో వెతికి చూసుకుంటే అద్భుతమైన పాటలు దొరుకుతాయి. ఇప్పుడు గేమ్ చేంజెర్ సినిమాలో కూడా అదే స్థాయిలో ఒక పాటని శంకర్ చేస్తున్నట్లు చేస్తున్నట్లు తెలిపాడు తమన్.
Also Read : Director Prasanth Varma: మహేష్ బాబు ఫ్యాన్స్ ను ట్రోల్ చేసిన ప్రశాంత్ వర్మ
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తర్వాత చరణ్ హీరోగా వస్తున్న కంప్లీట్ సినిమా ఇది. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అలానే ఈ సినిమాలో పొలిటికల్ టచ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే ఈ సినిమా ఈవెంట్ కి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇన్వైట్ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక తమన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సినిమాతో పాటు ఓ జి సినిమా కూడా పనిచేస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో తమను హవా కూడా బాగానే నడుస్తుంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన రీయంట్రి సినిమాలు అన్నిటికీ కూడా తమన్ సంగీతం అందించాడు. అలానే ప్రతి సినిమాకి తమన్ ముందుగానే ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. ఒకరకంగా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటే సినిమాకి కొంత పబ్లిసిటీ కూడా ఇస్తాడు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.