Director Prasanth Varma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ లో ప్రశాంత్ వర్మ ఒకరు. తను దర్శకత్వం వహించిన మొదటి సినిమా అ తోనే మంచి గుర్తింపును సాధించాడు. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇక తేజ సజ్జ హీరోగా చేసిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతి సీజన్ లో భారీ సినిమాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాతోనే ప్రశాంత్ వర్మకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమా అంటే మంచి అంచనాలు ఉన్నాయి. కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా చాలామంది దర్శకులకు తను కథను కూడా అందిస్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతూ ఉంటాడు ప్రశాంత్. బోయపాటి శ్రీను కూడా సరిపడే కథలు నా దగ్గర ఉన్నాయి అంటూ ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. రీసెంట్ దేవకీ నందన వాసుదేవా సినిమాకి కథను కూడా అందించాడు.
దేవకీ నందన వాసుదేవా ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ కథకు తాను దర్శకత్వం చేద్దామని అనుకున్నాడు. కానీ ప్రస్తుతం తనకున్న బిజీ షెడ్యూల్ వలన వేరే దర్శకుడు చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించాడు. అశోక్ గల్లా, మానస వారణాసి నటిస్తున్న ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేస్తున్నారు. ఈ సినిమా ఈవెంట్ కు సుధీర్ బాబు, బోయపాటి శ్రీను వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ అందరూ కూడా కేవలం సోషల్ మీడియాలో ఉండిపోకుండా, థియేటర్ కు వచ్చి ఈ సినిమాను చూడండి అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : Satya dev: ఆ సినిమా హిట్ అయ్యుంటే నా రేంజ్ వేరేలా ఉండేది!
ప్రశాంత్ వర్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం సోషల్ మీడియాలో మాత్రమే మహేష్ బాబు అభిమానులు కనిపిస్తారా, మిగతా చోట కనిపించరా అంటూ.. కొంతమంది మిగతా హీరో అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే ఈ సినిమాకి మహేష్ బాబు సపోర్ట్ ఎలా ఉంది అని అడిగినప్పుడు. రాజమౌళి గారి తో సినిమా ఉండటం వలన ఆయన బయటకు రావడం లేదు అంటూ హీరో అశోక్ గల్లా ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ సినిమా మీద ప్రశాంత్ వర్మ అందించిన కథ కాబట్టి మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు అదే డేట్ ను సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమా కూడా రిలీజ్ అవుతుంది.