Veterinarian Suicide| అభివృద్ధి దేశాలని గొప్పగా చెప్పుకునే పాశ్చాత్య దేశాల్లో ప్రజలు క్రూరంగా వ్యవహరిస్తున్నారు. కేవలం సరదా కోసం జంతువులను పెంచుకోవడం ఆ తరువాత వాటిపై మోజు తీరాక వాటిని యుథనైజ్ అనే పేరు పెట్టి చంపేయడం చేస్తున్నారు. అయితే ఇదంతా చట్ట ప్రకారమే జరుగుతోంది. పాశ్చాత్య దేశాల్ల జంతువులు చంపేందుకు యజమానులకు అనుమతి ఉంది. కానీ వాటిని జంతువుల డాక్టర్ వద్దకు తీసకెళ్లి యుథనైజ్ ప్రక్రియ ప్రకారం చంపాలి. యుథనైజ్ అంటే జంతువులకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి సునాయాసంగా చంపడం. కానీ ఒక జంతువుత డాక్టర్ ఆ పని రోజూ చేస్తూ.. ఏ పాపం ఎరుగని ఆ జీవాలని చంపడానికి ఎంతో మానసిక క్షోభ అనుభవించాడు. ఈ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
యుథనైజ్ అనే ప్రక్రియ కారుణ్య మరణం కిందికి వస్తుంది. ఏదైనా జంతువు వయసు కారణంగా రోగాల బారిన పడడం, ఏదైనా ప్రమాదం వల్ల దయనీయ పరిస్థితిలో జీవిస్తూ ఉంటే.. అలాంటి జంతువులకు యుథనైజ్ చేస్తారు. అయితే దీన్ని బ్రిటన్ దేశంలో చాలామంది దురుపయోగం చేస్తున్నారు. తమకు ఇష్టంలేని జంతువును పశువుల డాక్టర్ వద్దకు తీసుకెళ్లి యుథనైజ్ చేసేయమని చెప్పేస్తున్నారు. దీంతో ఆ వెటరినేరియన్లు వారు తెచ్చిన పెంపుడు కుక్కలు, పిల్లులు, ఉడతలు, పందులకు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేస్తున్నారు. ఈ పని చేయడానికి కూడా ప్రత్యేకంగా డాక్టర్లున్నారు.
Also Read: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!
బ్రిటన్ దేశంలోని హాంప్ షైర్ కౌంటీలో ఆండర్సన్ మూర్స్ అనే జంతువుల ఆస్పత్రి ఉంది. ఆ ఆస్పత్రిలో వెటరినేరియన్‌గా డాక్టర్ జాన్ ఎల్లిస్ (35) ఉద్యోగం చేసేవారు. ఆయన ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. అయితే చనిపోయేముందు డాక్టర్ జాన్ ఎల్లిస్ తాను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కారణాలు తెలుపుతూ ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లో షాకింగ్ విషయాలను వివరించాడు.
“నేను పనిచేసే జంతువుల ఆస్పత్రికి చాలామంది సంపన్నులు తమ పెంపుడు జంతువులను చికిత్స కోసం తీసుకొస్తుంటారు. అయితే కొంతమంది తమ పెంపుడు జంతువు అనారోగ్యంతో బాధపడుతూ ఉందని.. అది ఇక ఆరోగ్యంగా జీవించలేని కారణంగా దాన్ని చంపేయాల్సిందిగా కోరుతున్నారు. చట్టప్రకారం దీనికి అనుమతి ఉంది. అయితే ఆ జంతువులకు సరైన సమయంలో చికిత్స అందిస్తే అవి పూర్తిగా కోలుకునేందుకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని నేను జంతువుల యజమానులను వివరించాను. కానీ చాలామంది ఉద్దేశపూర్వకంగా ఆ జంతువులకు చికిత్స అందనివ్వకుండా మృత్య సమీపం వరకు తీసుకెళ్లి.. అప్పుడు నా వద్దకు తీసుకువస్తున్నారు. కొందరైతే త్వరగా దాన్ని చంపేయమని అంటారు. నేను వృత్తి ధర్మం కోసం ఆ అమాయక జీవాలకు చేతులారా ఇంజెక్షన్ ఇచ్చి చంపేయాల్సి వస్తోంది.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
కొందరు జంతువుల యజమానులు పెద్ద పెద్ద లగ్జరీ కార్లలో వస్తారు. కానీ తమ వద్ద జంతువులను పోషించేందుకు, వాటికి చికిత్స చేయించేందుకు డబ్బులు లేవని చెబుతారు. నేన తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని చంపుతున్నాను. చంపే సమయంలో వాటి కళ్లు చూసాను. నాకు నిద్రలో ఆ అమాయక ప్రాణుల కళ్లే కనిపిస్తున్నాయి. నాకు సరిగా నిద్ర పట్టడం లేదు.” అని రాశాడు.
డాక్టర్ జాన్ ఎల్లిస్ చనిపోక ముందు తనకు ఆస్పత్రిలో ఉద్యోగం ఇబ్బందిగా ఉందని చెప్పాడని ఆయన తల్లి టినె ఎల్లిస్ తెలిపారు. తన కొడుకు అకస్మిక మరణం తట్టుకోలేనంత బాధ మిగిల్చిందని ఆమె అన్నారు.
డాక్టర్ జాన్ ఎల్లిస్ మానసిక ఒత్తిడి భరించలేక.. ఆస్పత్రిలో ఒక నర్సుకు అబద్ధం చెప్పార. ఒక పెద్ద కుక్కను చంపడానికి ఇంజెక్షన్ తీసుకురావాలని అన్నారు. కానీ ఆ ఇంజెక్షన్ తనకు తానే ఇచ్చుకొని ప్రాణాలు వదిలాడు. ఆయనతో కలిసి పనిచేసిన వైద్య సిబ్బంది, ఆస్పత్రి యజమాన్యం.. డాక్టర్ జాన్ ఎల్లిస్ చాలా మృదు స్వభావి అని.. చాలా నైపుణ్యం కల వ్యక్తి అని చెప్పారు. ఆయన మరణంతో ఒక వైద్య నిపుణుడిని కోల్పోయామని ఆస్పత్రి యజమాన్యం ప్రకటించింది.