President Tour : భాగ్యనగరం వేదికగా అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం – లోక్ మంథన్ ప్రారంభం కానుంది. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు శిల్పారామంలో అంగరంగ వైభవంగా జానపథ కళా మేళ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి దౌపతి ముర్ము (President Draupadi Murmu) హజరుకానున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రపతి నగరంలోనే బస చేయనుండగా.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీంతో.. ద్రౌపతి ముర్ము బస, ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. అందులో భాగంగా రాష్ట్రపతి ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టింది.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉండనున్నాయని నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని, పోలీసులు సూచించిన మార్గాల్లో త్వరగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
గురువారం నాడు
సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేయడం లేదా మళ్లింపు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
బేగంపేట ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్ అవుట్ గేట్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, పీపీఎన్‌టీ ఫ్లై ఓవర్, ఎయిర్‌పోర్టు వై జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియా హోటల్, రాజ్‌భవన్ రోడ్డు, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్, తెలుగు తల్లి వంతెన, కట్టమైసమ్మ ఆలయం, ఇక్బాల్ మినార్, పాత అంబేడ్కర్ విగ్రహం జంక్షన్, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్ జంక్షన్.
శుక్రవారం రోజున
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు నగరంలోని కొన్ని జంక్షన్లల్లో ట్రాఫిక్ నిలిపివేయనున్నారు. రాజ్‌భవన్ కుడివైపు నుంచి వీవీ విగ్రహం కుడివైపు వరకు, కేసీపీ అన్సారీ మంజిల్- తాజ్‌కృష్ణ 1/7 రోడ్డు, 1/4 రోడ్డు, ఎన్‌ఎఫ్ సీఈఎల్ ఎస్‌ఎన్‌టీ, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డు నంబర్-45 జంక్షన్, కేబుల్ బ్రిడ్జి, రోడ్డు నంబర్-65, జూబ్లీహిల్స్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ- ఎన్‌ఎఫ్ సీఎస్, పంజాగుట్ట వంతెన, ప్రజాభవన్, బేగంపేట వంతెన, హెచ్‌పీఎస్ అవుట్‌గేట్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, విమానాశ్రయం వై జంక్షన్, బేగంపేట ఎయిర్‌పోర్టు.