SS. Thaman:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ సంగీత దర్శకులుగా పేరు సొంతం చేసుకున్నారు ఎస్.ఎస్.తమన్ (SS. Thaman). ముఖ్యంగా నటసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. బాలకృష్ణ సినిమాలకు తమన్ మ్యూజిక్ అందించారు అంటే అటు మ్యూజిక్ పరంగా సినిమా సక్సెస్ అవ్వాల్సిందే అనే నమ్మకం అటు ఆడియన్స్ లో కూడా బలంగా పాతుకు పోయింది. ఇదిలా ఉండగా సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ జాబితాలో తమన్ రెండవ స్థానంలో నిలిచారు. ముఖ్యంగా క్రేజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క హీరో సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తూ.. ప్రతి సినిమాకి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీగా మారిన తమన్..
ఏడాదికి 5-6 సినిమాలకు సంగీతం అందిస్తూ.. భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇక ఈ సంక్రాంతికి ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్ ‘ చిత్రాలు రెండు రోజుల గ్యాప్ లో విడుదలయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో ఫలితాల ఏమిటి? అనే విషయం కాసేపు పక్కన పెడితే.. రెండు సినిమాలలో కూడా తమన్ సంగీతానికి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి థియేటర్లలో గూస్ బంప్స్ వచ్చేసాయి. అంత అద్భుతంగా సంగీతాన్ని అందిస్తారు కాబట్టి.. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 10 కోట్ల రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.
సంపాదనలో సగం వారికే..
ఇదంతా ఇలా ఉండగా తమన్ వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేసి మాటలు అనరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎంత సౌమ్యులో దానం చేయడంలో కూడా అంత గొప్పవాడు అని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఒకవైపు సినిమాలకు మ్యూజిక్ అందిస్తూనే, మరొకవైపు క్రికెట్ ఆడడం వంటివి చేస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో ‘ఇండియన్ ఐడల్’ వంటి మ్యూజిక్ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే తన సినిమాల ద్వారా వచ్చే సంపాదన మాత్రమే తన ఇంటి ఖర్చుల కోసం, తనకోసం వాడుకునే ఈయన.. క్రికెట్, ఇండియన్ ఐడియల్ ద్వారా వచ్చే డబ్బులను మాత్రం చారిటీకి డొనేట్ చేస్తూ ఉంటారట. ఈ విషయం తాజాగా సోషల్ మీడియాలో బయటపడింది.ఈ విషయం తెలియడంతో అటు నెటిజన్స్ కూడా తమన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుత కాలంలో రూపాయి బయటకు తీయాలంటేనే వందసార్లు ఆలోచించే మనుషులు ఉన్న ఈ కాలంలో కూడా. లక్షల రూపాయలను చారిటీ కోసం కేటాయించడం నిజంగా గొప్ప మనసుకు నిదర్శనం అంటూ తమన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తమన్ ప్రస్తుత సినిమాలు..
ప్రస్తుతం సంగీతం అందించనున్న సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ (Pawan kalyan ) తో ‘ఓజీ’, బాలకృష్ణతో ‘అఖండ 2’, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో ‘రాజాసాబ్ ‘వంటి చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఓజీ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. మరోపక్క అఖండ 2కి కూడా ప్రాణం పెట్టి మరీ అదిరిపోయే రేంజ్ లో మ్యూజిక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా తమన్ ఇలాగే వరుస సినిమాలు చేస్తూ అటు ప్రజలకి కూడా అండగా నిలవాలని కోరుకుంటున్నారు అభిమానులు.