Jos Buttler: భారత్ – ఇంగ్లాండ్ మధ్య 5 టీ-20 ల సిరీస్ లో భాగంగా నేడు (జనవరి 22) న కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. ఇంగ్లాండ్ జట్టుకు జోష్ బట్లర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ తొలి టి-20 కోసం ఇరుజట్లు శనివారమే ఈడెన్ గార్డెన్స్ చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి.
Also Read: Kohli- Army: వివాదంలో విరాట్ కోహ్లీ…ఆర్మీనే అవమానిస్తావా..ఎంత బలుపు ?
అయితే మ్యాచ్ కి ముందు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోష్ బట్లర్ టీమిండియాకు సంబంధించిన వీల్ చైర్ క్రీడాభిమాని ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. భారత వీల్ చైర్ క్రికెటర్ ధరమ్ వీర్ పాల్ నుండి తన బ్యాట్ పై ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు జోష్ బట్లర్. దీంతో భారత క్రీడాభిమానులు అతడిని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బట్లర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ టి-20 సిరీస్ కి ఇంగ్లాండ్ వికెట్ కీపింగ్ బాధ్యతలకు దూరంగా ఉండనున్నాడు జోష్ బట్లర్. ఛాంపియన్ ట్రోఫీకి ముందు అతనిపై పని భారం తగ్గించేందుకే వికెట్ కీపింగ్ నుంచి దూరంగా ఉంచినట్లు సమాచారం. బట్లర్ కూడా వికెట్ కీపింగ్ పై ఆసక్తి చూపించలేదని ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అధికారికంగా ప్రకటించారు. ఫీల్డింగ్ సమయంలో బట్లర్.. బౌలర్ తో అవసరమైనప్పుడు మాట్లాడాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇక మూడు సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ-20 మ్యాచ్ జరగబోతుండడంతో ఈ మ్యాచ్ కి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి తోడు ఇంగ్లాండ్ పై భారత టి-20 రికార్డ్ అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు భారత్ – ఇంగ్లాండ్ మధ్య మొత్తం 24 మ్యాచ్ లు జరగగా.. ఇందులో భారత జట్టు 13 మ్యాచ్ లలో గెలుపొందింది. మరో 11 మ్యాచ్ లలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది.
ఇంగ్లాండ్ తో జరగబోయే ఈ ఐదు టి-20 ల సిరీస్ జనవరి 22 నుండి ఫిబ్రవరి 2 వరకు జరగబోతోంది. ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టుకు సూర్యకుమారి యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇండియా vs ఇంగ్లండ్ T20I స్క్వాడ్స్:
భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా.
Also Read: 2025 Physical Disability Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన దివ్యాంగుల టీమిండియా
ఇంగ్లాండ్ జట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(w), జోస్ బట్లర్(c), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్, బ్రైడన్ కార్సే, జామీ స్మిత్ , రెహాన్ అహ్మద్.
Jos Buttler taking an Indian wheelchair cricketer’s autograph. ❤️
– A lovely moment at the Eden Gardens.pic.twitter.com/5G48N91h5k
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2025