Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో చాటి చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా విడుదలకి ముందు నుంచే ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కొంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా ఏ స్థాయిలో అయిందో అదే స్థాయిలో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. వెంటనే ఇదే సినిమాను బాలీవుడ్లో తెరకెక్కించి అక్కడ కూడా మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. చాలామంది సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసి అది ఒక వైలెంట్ ఫిలిం అంటూ కబీర్ సింగ్ విషయంలో చెప్పుకొచ్చారు. అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను మీకు చూపిస్తా అంటూ ఛాలెంజ్ చేశాడు. చెప్పిన మాదిరిగానే అనిమల్ సినిమాతో మరోసారి సంచలనం సృష్టించాడు.
బాలీవుడ్ షేక్
రణబీర్ కపూర్ నటించిన అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ తో కలెక్షన్ లో ఊచ కోత కోసింది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది. అప్పుడు కూడా చాలామంది బాలీవుడ్ జర్నలిస్టులు సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేశారు. అంతే దీటుగా సందీప్ నిలబడి అందరికీ కౌంటర్ అటాక్ చేశాడు. ఈ సినిమా గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసింది. సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు అని ఇదివరకే చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం కూడా విపరీతంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్ అయిందా.?
అర్జున్ రెడ్డి సినిమా టైంలో విజయ్ దేవరకొండ కాకుండా ఈ సినిమాకి ఎవరు పర్ఫెక్ట్ ఛాయిస్ అని అడిగినప్పుడు అల్లు అర్జున్ అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత మైకేల్ జాక్సన్ బయోపిక్ తీయాలి అని ఉంది అని చెప్తూ, అల్లు అర్జున్ సూట్ అవుతాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ తో కాకుండా రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం వస్తుంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే అట్లీ ప్రాజెక్టుకు మినిమం రెండు సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. అందుకోసమే ఈ ప్రాజెక్టు కాస్త చరణ్ కు షిఫ్ట్ అయింది అని తెలుస్తుంది.
Also Read : AA22xA6 : కెరియర్ లో మొదటిసారి ట్రిపుల్ రోల్ లో కనిపించనున్న అల్లు అర్జున్.?