Thaman: జనసేనని పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారి చేస్తున్న సినిమా “ఓజీ”. ముంబై బ్యాక్ డ్రాప్ లో, పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ “ఓజస్ ఘంభీర” పాత్రలో నటిస్తున్నాడు. కటానా పట్టుకోని పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తుంటే ఫ్యాన్స్ కి పూనకలు రావడం గ్యారెంటీ. ఇప్పటికే ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసిన డైరెక్టర్ సుజీత్, పవన్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చాడు. ఒక ఫ్యాన్ గా థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ సినిమాలు చూసిన సుజీత్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఒక ఫ్యాన్ తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ పీకే ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
ఓజీ గ్లింప్స్ రేంజులో సినిమా మొత్తం ఉంటే మాత్రం బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం జరగడం గ్యారెంటీ. ఈ విధ్వంసానికి ఈ సెప్టెంబర్ ముహూర్తం అయ్యింది. సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకూ ఉన్న అన్ని బాక్సాఫీస్ రికార్డ్స్ చెల్లాచెదురు అయ్యి పవన్ కళ్యాణ్ పేరు మీదకి రాబోతున్నాయి అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ రేంజ్ హైప్ ని సొంతం చేసుకుంది ఓజీ మూవీ.
ఓజీ సినిమాపై ఇప్పటికే ఉన్న హైప్ ని మరింత పెంచే పనిలో ఉన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. గ్లింప్స్ కి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చి, ఫ్యాన్స్ కి పూనకలు తెచ్చిన ఎస్.ఎస్.థమన్ తాజాగా తన ఎక్సైట్మెంట్ వ్యక్తం చేస్తూ ‘They Call Him OG’ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
థమన్ మాట్లాడుతూ, “నా రక్తం ఉరకలేస్తోంది OG బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయడానికి. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ సర్ ఒక చేతిలో కటానా, మరో చేతిలో గన్ పట్టుకుని ప్రతివారినీ షూట్ చేస్తున్న దృశ్యాలు చూశాను. ఈ సినిమా కోసం నేను సాధారణంగా ఉపయోగించే వాయిద్యాలను పక్కనపెట్టి కొత్త వాయిద్యాలతో కంపోజ్ చేస్తాను. బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్న సమయంలో నా గదిలో పవన్ కళ్యాణ్ పోస్టర్లతో నింపేస్తా!” అంటూ తన క్రేజీ అప్డేట్ ఇచ్చాడు.
ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న అప్డేట్ బయటకి రావడంతో పూనకలు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓజీ సినిమాని ట్రెండ్ చేస్తున్నారు. మరి సుజిత్ స్టైలిష్ మేకింగ్, పవన్ కళ్యాణ్ మాస్ లుక్‌కి తగ్గట్టుగా థమన్ ఏ రేంజ్ మ్యూజిక్ అందిస్తాడో చూడాల్సిందే!