Rohit Sharma: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ 18వ ఎడిషన్ గడువు సమీపించింది. మరో నాలుగు రోజుల్లో.. అనగా ఈనెల 22వ తేదీన తొలి మ్యాచ్ జరగబోతోంది. 2024లో ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ లో పోటీ పడబోతున్నాయి. కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ పిచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది.
Also Read: Rohit Sharma: కెప్టెన్సీ మూడ్ లో రోహిత్… ఎయిర్ పోర్టులో ఫీల్డింగ్ చేస్తూ !
ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియాను ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ రోహిత్ శర్మ రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేశాడు రోహిత్ శర్మ. తన కూతురు సమైరాతో కలిసి మాల్దీవ్స్ లో చిన్నపిల్లడిలా మారి ఆటలాడుతూ గడిపాడు. ఐపీఎల్ హీట్ కి ముందు బాడీ, మైండ్ ని రిలాక్స్ చేసుకున్నాడు. మాల్దీవుల అందాలను ఆస్వాదిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేశాడు.
భారత జట్టుకు ప్రతిష్టాత్మక టోర్నీని అందించి.. సముద్ర తీరాన కుటుంబంతో ప్రశాంతంగా గడిపాడు. అయితే మాల్దీవ్స్ లో సైకిల్ తొక్కుతూ, కుమార్తె సమైరాతో ఆడుకుంటూ హిట్ మ్యాన్ సరదాగా గడిపాడు. ఓవైపు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ లోని ప్రధాన సభ్యులందరూ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనడం ప్రారంభించినప్పటికీ.. రోహిత్ శర్మ మాత్రం కొద్ది రోజులు కుటుంబానికి సమయాన్ని కేటాయించి సోమవారం రోజు రాత్రి తిరిగి ముంబై చేరుకున్నాడు.
ఇక ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే భారత జట్టు ఇంగ్లాండ్ తో జరిగే ఐదు మ్యాచ్ సిరీస్ కోసం యూరప్ కి వెళ్లబోతోంది. ప్రస్తుత జట్టు మేనేజ్మెంట్ ఆకస్మిక మార్పులు చేయకపోతే.. ఈ సిరీస్ కి రోహిత్ శర్మనే కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇక గత కొంతకాలంగా అంబానీ ఫ్రాంచైజీకి ఐపీఎల్ లో గడ్డు పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. గత సీజన్ లో మా ఇంట్లో పట్టికలో ఏకంగా 10వ స్థానంలో నిలిచింది.
Also Read: IPL 2025: IPL 2025 అట్టర్ ఫ్లాఫ్…అమ్ముడుపోని టికెట్లు ?
ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో తెలివైన కొనుగోళ్లతో మునుపటి వైభవం సాధించేలా ప్రణాళికలు రచించింది ముంబై. ఇప్పటివరకు 17 సీజన్లు జరిగిన ఐపిఎల్ లో.. ఐదు సీజన్లలో ఫైనల్ వరకు వచ్చింది ముంబై ఇండియన్స్. ఆ తర్వాత 8 సీజన్లలో ఏకంగా 5 టైటిల్స్ సాధించింది. ఈ ఐదు ట్రోఫీలు రోహిత్ శర్మ కెప్టెన్సీ లోనే రావడం విశేషం. ఇక గత మూడు సీజన్లుగా ముంబై దారుణంగా విఫలమవుతుంది. మరి ఈ సీజన్ లో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.