SS Thaman : మాట జారిన తమన్.. నెటిజన్స్ వార్నింగ్..

SS Thaman : మాట జారిన తమన్.. నెటిజన్స్ వార్నింగ్..

SS Thaman
Share this post with your friends

SS Thaman

SS Thaman : దసరా పండగకు బరిలోకి దిగి బాలీవుడ్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తున్న చిత్రం బాలయ్య భగవంత్ కేసరి. ఈ మూవీ స్టోరీ పరంగా ఎంత హైలైట్ అయిందో.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతగానే హిట్ అయింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన వ్యక్తి తమన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఒక్కొక్క సీన్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటే.. ఆ కిక్కు వేరే లెవెల్ లో ఉంటుంది. నిజానికి భగవంత్ కేసరిలో పాటలు చాలా తక్కువ. ఉన్న రెండు, మూడు పాటల్లో రెండు బాగా హిట్ కూడా అయ్యాయి.

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. ఆ లిస్టులో తమన్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఒక ఏడాది నుంచి పెద్దపెద్ద హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ ఎప్పుడు బిజీ గా ఉండే వ్యక్తి తమన్. ఆయన కేవలం సాంగ్స్ కే కాదు.. మరొక విషయంలో కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాడు. అదేనండి ట్యూన్స్ కాపీ కొట్టడం. తమన్ చేసిన ఏ సాంగ్ అయినా ఎక్కడో ఒక దగ్గర నుంచి కాపీ కొట్టేశారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ రచ్చ చేయడం చాలా కామన్.

అందుకే ఎక్కువగా సోషల్ మీడియాలో తమన్ పై కాపీ క్యాట్ అంటూ విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. మొదట్లో ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్న తమన్.. ఆ తర్వాత దీన్ని లైట్ గా తీసుకోవడం మొదలుపెట్టాడు. అయినా సరే నెటిజెన్లు మాత్రం వదలకుండా.. కొత్తగా ఏ పాట చేసినా పాట బాగుందా, బాగాలేదా అన్న విషయాన్ని పక్కన పెట్టేసి.. ఏదొక మూవీ లేక ఆల్బమ్ నుంచి కాపీ కొట్టారు అన్న విషయంపై ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. అంతటితో ఊరుకోకుండా ఆ సాంగ్ ఒరిజినల్ ది ఎక్కడైనా దొరికిందా.. దాన్ని దీన్ని కంపేర్ చేసి మీమ్స్ పెట్టేస్తున్నారు.

ఇక ఈ విషయంలో పెద్దగా పట్టించుకునేది లేదని.. తన మీద వచ్చే ట్రోల్స్ ని చూసి ఎంజాయ్ చేస్తున్నానని తమన్ పలు సందర్భాల్లో అనడం కూడా జరిగింది. అయితే అప్పుడప్పుడు తమన్ తన మాటల వల్ల కూడా విమర్శలకి గురైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా బాలయ్య భగవంత్ కేసరి సినిమా సక్సెస్ మీట్ లో కూడా ఇదే జరిగింది. ఇటీవల తమన్.. తన పాటలను విమర్శించే నెటిజన్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్స్ తమన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ తమన్ ఏమన్నాడంటే.. “ఒక సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేస్తాము. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగిన సినిమా పై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది కనుక చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఎంతో కేర్ తీసుకుంటాము. అయినా కొందరు నెటిజన్స్ ప్రతి విషయాన్ని ట్రోల్ చేస్తారు.” అని అంటూ.. అక్కడితో ఊరుకోకుండా “ట్విట్టర్, ఫేస్ బుక్ తెరిస్తే నా కొడుకులు ఏదేదో వాగుతున్నారు.మా కష్టం వాళ్లకేం తెలుసు?” అని కాస్త ఘాటుగా విమర్శించారు. ఇక దీంతో రెచ్చిపోయిన నెటిజన్స్ అతని వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఇప్పటికైనా అలా కాపీ ట్యూన్స్ వాడడం మానేసి.. విమర్శించే వారిని తిట్టడం మీద పెట్టే శ్రద్ధ సొంత ట్యూన్ల మీద పెట్టుకుంటే బాగుంటుందని రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

YSRCP | ధర్మవరంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైసీపీ నేతలు

Bigtv Digital

Rohit Sharma : సిక్సర్లతో రోహిత్ రికార్డుల మోత

Bigtv Digital

Digvijay: దిగ్గీ టాక్స్.. ఫుల్ టాక్ టైమ్.. ఓవర్ టు గాంధీభవన్

BigTv Desk

Congress: కోమటిరెడ్డికి సీనియర్ల సపోర్ట్.. పాదయాత్రలు ఎవరికి వారే.. అట్లుంటది కాంగ్రెస్ తోని.

Bigtv Digital

Bunny Special Training : బన్నీ కోసం సుక్కు సూపర్ స్కెచ్.. స్పెషల్ ట్రైనింగ్

BigTv Desk

AP : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ మంజూరు..

Bigtv Digital

Leave a Comment