BigTV English

Thandel: చైతూకి అదృష్టంగా మారిన శోభిత.. వైరల్ గా మారిన తండేల్ ఫస్ట్ రివ్యూ..!

Thandel: చైతూకి అదృష్టంగా మారిన శోభిత.. వైరల్ గా మారిన తండేల్ ఫస్ట్ రివ్యూ..!

Thandel: అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తండేల్ (Thandel) సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా శోభిత ధూళిపాళతో రెండో పెళ్లి తర్వాత బాగా కలిసి వస్తోంది అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


తండేల్ సినిమా ఫస్ట్ రివ్యూ..

ప్రముఖ డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా రెండవసారి జత కట్టిన చిత్రం తండేల్. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘లవ్ స్టోరీ’ సినిమా వచ్చింది. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వం వహించారు. దాంతో ఈ జంటను మళ్లీ రిపీట్ చేయడం జరిగింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravindh) సమర్పణలో బన్నీ వాసూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారుగా రూ.85 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతోంది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి ఫస్ట్ రివ్యూ కూడా లీక్ అయ్యింది. ఈ చిత్రానికి 2:32 గంటల నిడివితో పర్ఫెక్ట్ రన్ టైం లాక్ చేశారు. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఒక్క కట్ కూడా చెప్పకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.


చైతూ కెరీర్ కి శోభిత అదృష్టంగా మారనుందా..?

ఇకపోతే సెన్సార్ సభ్యుల నుంచి తండేల్ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్క కట్ కూడా లేదు అంటే, ఇక ఈ సినిమా సెన్సార్ బోర్డు సభ్యులను ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా యువతకు నచ్చేలా నాగచైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ఉంటుందని కూడా అంటున్నారు. ముఖ్యంగా సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా సాగుతుందని కూడా కామెంట్ లు చేస్తూ ఉండడం గమనార్హం. ప్రత్యేకించి 20 నిమిషాల పాటు పాకిస్తాన్ కి సంబంధించిన సన్నివేశాలు ఉంటాయట. అందులోనూ చందూ విజువల్స్ అద్భుతంగా చూపిస్తూ.. ఈ చిత్రాన్ని చాలా ఎంగేజింగ్ గా మలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే నాగచైతన్య తండేల్ మూవీకి సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రివ్యూ వచ్చింది అని తెలియడంతో అప్పుడే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు శోభిత (Shobhita) తో పెళ్లి తర్వాత నాగచైతన్యకు లభించబోతున్న ఫస్ట్ బ్లాక్ బస్టర్ అని కూడా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు నాగచైతన్య కెరియర్లో ఇదొక ‘శివ’ మూవీలా మిగిలిపోతుంది అని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా శోభిత నాగచైతన్య జీవితానికి అదృష్టంగా మారింది అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల నుండి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. దీన్ని బట్టి చూస్తే నాగచైతన్యకు శోభిత బాగా కలిసి వచ్చిందనే వార్తలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×