BigTV English

Allu Arjun: 280 కోట్ల డీల్ రా.. హీరో అయ్యి ఉండి ఆ మాత్రం కూడా చేయడా.. ?

Allu Arjun: 280 కోట్ల డీల్ రా.. హీరో అయ్యి ఉండి ఆ మాత్రం కూడా చేయడా.. ?

Pushpa 2: ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఒక సినిమా థియేటర్ లోకి వస్తుంది అని అంటే.. అది ముందు ప్రేక్షకుల మధ్యకు వెళ్ళాలి. అప్పుడే  సినిమాపై హైప్ పెరుగుతుంది. ఇక కథ నచ్చింది అంటే ఆ సినిమాను ఆపడం ఎవరితరం కాదు. పుష్ప 2 విషయంలో అదే జరిగింది. మొదటి నుంచి పుష్ప 2 పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పుష్ప 2 ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండడంతో  సినిమాపై హైప్ ఎక్కువ అయ్యింది.


ఆలోపే  అల్లు అర్జున్ వివాదాలలో ఇరుక్కోవడం.. రోజు సోషల్ మీడియాలో అతడి గురించే చర్చ జరగడం.. ఇన్ని వివాదాల మధ్య పుష్ప 2 రిలీజ్ అవుతుందా.. ? అనే డైలమా.. ? హిట్ అవుతుందా.. ? అనే అనుమానం.. ఇలా రిలీజ్ అయ్యే రోజువరకు పబ్లిసిటీ పీక్స్ లో ఉండడంతో.. టికెట్ రేట్ ఎంతైనా పర్లేదు.. సినిమా ఎలా ఉందో చూడాలని ఫ్యాన్స్ క్యూ కట్టారు. అనుకున్నట్టుగానే మొదటి రోజు మిక్స్డ్  టాక్ అందుకున్నా కూడా పుష్ప 2  అస్సలు ఆగలేదు. ఎన్ని వివాదాలు వచ్చినా.. చివరికి  అల్లు అర్జునే జైలుకు వెళ్లినా కూడా పుష్ప 2 కలక్షన్స్  ఆగలేదు.

ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో పుష్ప 2 రికార్డులు సృష్టించింది. తెలుగులో రూ. 1900 కోట్లు సాధించి ఇండస్ట్రీని షేక్ చేసింది. హిందీలో ఏ హీరో కూడా సాధించని రేర్  రికార్డ్ ను అల్లు అర్జున్ సాధించాడు. ఇప్పటివరకు రాజమౌళి సినిమా కూడా  మూడువారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. అలాంటింది పుష్ప 2 మాత్రం రెండు నెలలు అయినా ఓటీటీలోకి రాలేదు. ఇక నిన్ననే నెట్ ఫ్లిక్స్ పుష్ప 2 ఓటీటీని కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ కూడా కండిషన్స్ మానలేదు. పుష్ప 2 ఓన్లీ రెంట్ అని చెప్పుకొచ్చింది.


Prabhas: ప్రభాస్ కు స్టెప్స్ నేర్పించిన రాకేష్ మాస్టర్.. నిజంగానే శేఖర్ మాస్టర్ ఆయనను తొక్కేశాడా.. ?

అంతేనా ఇప్పటివరకు స్ట్రీమింగ్ డేట్ కూడా చెప్పలేదు. ఈలోపే ఓటీటీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఓటీటీ ట్రైలర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు నెట్ ఫ్లిక్స్. ఒక అడుగు ముందుకు వేసి.. బన్నిచేతనే ప్రమోషన్స్ చేయిస్తుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ గురించి బన్నీ ప్రమోట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప రాజ్ స్టైల్ లో బన్నీ నెట్ ఫ్లిక్స్ గురించి చెప్పుకొచ్చాడు.  నెట్ ఫ్లిక్స్ అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోపై నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఓటీటీ ప్రమోషన్స్ కోసం కూడా బన్నీ డబ్బులు తీసుకున్నాడని చెప్పుకోస్తున్నారు. ఇంకొందరు.. పుష్ప 2 చరిత్రలోనే నెట్ ఫ్లిక్స్ చేసిన బిగ్గెస్ట్ డీల్ అంటే ఇదే. రూ. 280 కోట్లు పెట్టి పుష్ప 2 హక్కులను కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. మరి అంత డబ్బు పెట్టి కొన్నందుకు హీరో ఆ మాత్రం చేయడా.. ? అని చెప్పుకొస్తున్నారు.  మరి థియేటర్ లో రికార్డులు  సృష్టించిన పుష్పరాజ్.. ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×